Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

జనతిరస్కారి యగు వానిసత్ప్ర్పతాప
మహిమచే ధిక్కృతుం డయ్యె దహనుఁ డాధి
చేఁ గృశింపుచు బాష్పముల్ జిలుకరించి
ద్విగుణముగ ధూమపటలంబు విస్తరించె.

125


వ.

మఱియు నత్యుగ్రతేజుండగు రావణుని సేవించుటకు సర్పం
బులు స్వకీయంబైన పరమర్మభేదకద్విజిహ్వతాదోషంబు పరి
త్యజించి యజిహ్వగమనంబులైన సకర్ణవర్గంబులచేత నిజభుజం
గత్వంబు భజింపఁబడ దయ్యె నదియునుంగాక.


చ.

విపులతదీయవారణవిభిన్నవిశాలకటంబు లౌటచే
నుపరతదానధారలయి యోడి దిశేభము లున్కిపట్లకున్
జపలతఁ బాసి యచ్చటనె సంతతమున్ వసియించినందునన్
విపులదిశాగజంబు లనుపే రది సార్థకమయ్యె వానికిన్.

127


మ.

కుసుమాస్త్రజ్వరతాపతప్తమగు రక్షోభర్త నెమ్మేనికిన్
వ్యసనాత్యుష్ణములైన దైత్యకులరాడ్బందీకృతేంద్రాంగనా
శ్వనితోరుశ్వసనప్రచారములచే సౌఖ్యంబు వాటిల్లిన
ట్లసమానందము గల్గ దెప్పుడు పటీరాంచద్ధవిత్రంబులన్.

128


మ.

అనిశంబున్ ఋతువుల్ సమగ్రఫలపుష్పాఢ్యంబు లై బల్‌తపం
బును హేమంతము సన్మనోజ్ఞశిశిరంబుం దద్వసంతేందిరన్
ఘనవర్షర్తుశరత్తులుం గలసి వేడ్కన్ దన్మహాపట్టణం
బున వాస్తవ్యకుటుంబితన్ వెలయు నామోదంబు సంధిల్లఁగన్.

129


తరువోజ.

అనఘాత్మ ! యజుఁడ వవ్యయుఁడ వనాది వనుపమాన
బలుండవై నట్టి నీవు
తను వధించుటకు నై తత్పరత్వమున మనుజలోకంబున మనుకులమందు
ఘనరాముఁ డనుపేరఁ గలుగుట యెఱిఁగి వినయంబుతో సీత విడువఁడు వాఁడు;
పనివడి మానులై పరగినవారు ప్రణుతాభిమానైకద్రవిణులు గారె?

130


ఉ.

అప్పుడు, రామరూపమున నర్మిలి నీవు మహాపయోనిధిం
దప్పక సేతుమార్గమున దాఁటి యనిన్ వనితాపహారకున్