Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మిక్కిలిఁబ్రకాశించె సమాచ్ఛాదితసూర్యమండలంబులైన శర
సమూహంబులచేత గగనంబు నాచ్ఛాదించె నయ్యవసరంబున
హరిచాపయష్టియందు బాణం బొక్కసారి విసృష్టయై పుంఖాను
పుంఖత్వంబుచేత బాణసంధానమోక్షదుర్లభ్యత్వంబువలన ననేక
బాణంబు లేకబాణంబుగాఁ గనుపట్టె.

206


సీ.

అతివేగరావంబు లతులపతత్రముల్
                        కాంచనపింగళకాయకాంతు
లగు దానవారిసాయకములు భయమూఢ
                        కాకోదరంబులు గలుగునట్లు
ధరణి భేదించి పాతాళతలము సొచ్చెఁ
                        జేదీశుచే మున్ను చింత లేక
పరమర్మభేదనపరుషవృషత్కంబు
                        లపరాధములభంగి నచ్యుతునకు


గీ.

దుఃఖ మొనరింపలేవయ్యెఁ దోడుతోడ
నధికమాయుఁడు లయకాలమందు యోగ
నిద్రితుం డగుశౌరికి నిద్ర గలుగఁ
జేయుటకు స్వాపనాష్త్రంబు చెలఁగి యేసె.

207


వ.

ఇట్లు శిశుపాలుండు స్వాపనాస్త్రంబు ప్రయోగించిన భాస్కరుని
నర్ధశూన్యసంజ్ఞ గలవానిఁగాఁ జేయుచు నిద్రాఘూర్ణితలోచనా
రవిందంబులు గలుగునట్లుగా నమ్మహాస్త్రప్రభవాంధకారంబు
హరినైన్యంబు నాచ్ఛాదించె.

208


చ.

అపుడు మహీపతుల్ నిజశరాసనమందు నిషణ్ణమూర్తులై
విపులత నిద్రనొంది రది వింతయె మేల్కోనియుండు వేళలన్
విపులవిపద్వినాశకరవిశ్రుతచాపముపై నిషణ్ణులై
నిపుణత నెప్డు నేమరక నిద్దురవోయెడు శూరకోటికిన్.

209


గీ.

శ్లథత నొంది వహనశక్తి లేని విపక్ష
వరుల చేతిధనువు వదలిపడియె
మొనసి యభ్యసించియును బ్రమాదంబున
గళిత మైన విద్యకరణి నపుడు.

210