దూరంబున మహీతలంబునం దదృశ్యత్వంబు నొందె గొన్ని
బాణంబులు రిపుకంఠచ్ఛేదనంబుగావించి మాంసఖండ
పరిచితంబు లైన ముఖంబులు గలవియై పక్షులుంబోలె నాకా
శంబున కెగసె నప్పుడు రిపుశరీరసంజాతశోణితంబు శత్రునారీ
నేత్రసంజాతబాష్పతోయంబులుం గలసి ప్రవాహరూపం బై
ప్రవహించె హరిమాయావిశేషంబున శత్రుసైన్యంబునందుఁ బరి
పంథు లేకద్త్రిచతు రాకారంబులు గలవానిఁగా గృష్ణుని
విలోకించి తత్క్షణఁబ తాము పంచత్వంబు నొందరి సదామదబల
ప్రాయుండును సమద్దృతరసుండును బ్రతీతవిక్రముండును
శ్రీమంతుండు నగుహరి రెండవహరియుం బోలెఁ ప్రకాశించె
నిట్లు హరిశరంబులు శత్రువధాత్మకంబైన యిష్టార్థంబు గావించి
యధోముఖంబులై మహీతలంబు ప్రవేశించె సర్వలక్షణపరిపూర్ణ
శరీరుండును నిరస్తశత్రుతేజుండును మహాత్ముండును నగు
కృష్ణుండు దైవసంపన్నవపూరణంబులైన సంగ్రామంబులందు
జయంబు నొంది రణసముద్రం బంతయు నిస్తరించి తేజోవంతుండై
ప్రకాశించె నిట్లు లబ్ధవిజయుండై కళ్యాణమూర్తియు లబ్ధాఘ
క్షయశుద్ధియు శ్రీవత్సలాంఛనవిశేషభూషితవక్షుండును
నిర్భీకుండును శత్రుమృగవ్యాధుండును నిత్యాభ్యుడయవం
తుండును నగుకృష్ణుండు రణరాగంబువలన నహంకారోద్ధురం
బైన సత్వంబు నవలంబించి మహోత్సాహంబున సింహనాదంబు
గావించె నంత.