Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.⁠

తతముక్తబహువిశిఖయదు
పతిచావం బటు హరించెఁ బరజీవితముల్
చతురతఁ బరచాపసజీ
వతను మది సహింపదయ్యెఁ బవరమునందున్.

⁠ 184


గీ.⁠

వరరు డవివరుండు వైరివివారియు
వారిరారవుండు వరుఁడు వీరుఁ
దుర్వరాగతపను నొప్పుననొప్పు ము
రారి విస్తరించె వైర మపుడు.

⁠ 185


గీ.⁠

అరినిహంతయు నైన శ్రీహరిశరములు
తవిలి పానార్థరక్షార్థధాతువు లగు
చుండ వైరుల శోణితం బొనరఁ గ్రోలె
భువనములను రక్షించె నద్భుతము గాఁగ.

⁠ 186


గీ.⁠

అవనిభారావతరణార్థ మంచితముగ
నవతరించినవాఁ డయ్యు నచ్యుతుండు
ప్రబలశాత్రవపృథుశరీరములచేత
భూమివర్దన మొనరించె నేమి చెప్ప.

⁠ 187


క.⁠

హరి యొకశరమున వ్రేల్మిడి
నరిగణతరువులను గూల్చె నటు తా మును సుం
దరరామరూపమున ను
ర్వరలోఁ గావించినట్టి పనికి సమముగాన్.

⁠ 188


క.⁠

శూరుఁడు లక్ష్మీప్రియుఁడగు
శౌరి దిశావ్యాపకాతిశాతశరములన్
వారక నిలఁబడవ్రేసెను
వైరిశరంబులను దాళఫలములమాడ్కిన్.

⁠ 189


ఆ.⁠

అరిమనోహరంబులై శౌరితూపులు
హృదయ మందు నిలువ కేగె నవలి
కందువలన సారె కరుల శత్రుత్వంబు
వ్యక్తమయ్యె హరికి నాలమందు.

⁠ 190


వ.⁠

ఇట్లమ్మధుసూదనుం డఖండకోదండపాండిత్యంబు మెఱయఁ దండో
పతండంబులుగాఁ గాండప్రకాండంబులు పరఁగించిన నందు హరి
నామాంకితంబు లైన కొన్నిబాణంబులు శత్రుశరీరంబుల
ప్రాణంబులు హరించెంగాని నామాక్షరంబులకు మాలిన్యంబు
గలుగునని తచ్ఛోణితంబు సంస్పృశింపవయ్యెఁ గొన్నిసాయ
కంబులు వీరవర్గప్రాణసర్వస్వంబును హరించి చోరులుంబోలె

⁠