Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చేతనే రోగంబును హరించినట్లు మాధవుండు దర్శనమాత్రంబు
చేతనె వారలపాపంబు లన్నియు హరించె.

175


క.

జితయుద్ధబలమునం దొగిఁ
జతురత సమరంబు సేయ జనుదెంచు హరిన్
జితగదుని భువిఁబ్రసిద్ధుని
హితవీర్యునిఁ దాఁకి గెలువ నెవ్వం డోపున్.

176


ఆ.

అగ్రభాగమందు నతిగరీయంబైన
కృత్యమంచు నిర్ణయింపఁబడిన
యధిపుచేత మిగుల నారోపితగుణోరు
కార్మికంబు నమ్రగతి వహించె.

177


ఆ.

అందుఁ బర్వయుతము లగుట రమ్యములైన
యమ్ము లపుడు సంహితంబు లయ్యె
వీను లంట లాగి విడిచినఁ గార్ముక
ధ్వని సుపరుషమయ్యెఁ బరుల కపుడు.

178


ఉ.

చండభుజావలేపమున శౌర్యధనుం డగు శౌరి భూరికో
దండము నెక్కుఁబెట్టి గుణదారుణశబ్దము భూనభంబులున్
నిండ ననేకకాండములు నేర్పునఁ గూర్చి విపక్షసేనపై
మెండుగఁ బర్వఁజేసె నటు మింట సువర్వులు సన్నుతింపఁగన్.

179


గీ.

పరఁగఁ బశ్చాత్కృతంబై న పత్రులందు
నొనర నేపత్రి సుగుణసంయుక్త మయ్యె
నట్టి పత్రి మాధవుని కర్ణాంతమందుఁ
జేరె నాప్తునిచందానఁ జెలువు మీఱ.

180


వ.

మరియు వరుండును పరవిదారియు బహురూపవంతుండును
నిష్పాపుండును భక్తవరదుఁడును నగు కృష్ణుడు శత్రువులచేత
నవరుద్ధుండయ్యె మరికొందరు శత్రువులచేత ననంతబాణంబుల
పూరితుండయ్యె.

181


గీ.

దిఙ్ముఖవ్యాపకము లతితీక్ష్ణములును
హ్రాదులును సంతతము మర్మభేదనములు
నైన శరములు శత్రుల నచ్యుతుండు
విడిచె నేకకాలంబున వేగ మడర.

182


సీ.

అనిలోన మాధవు ధనువొక్కటియె గాదు
                        మండలీకృత మౌట చండకాండ
మథితమై రిపుసేన మండలీకృత మయ్యె
                        మఱియు లోకాలోకి మధురభాషి
కలుషవిదూరుండు నళికులాలకుఁడు ని
                        రంకుశుం డకలంకుఁ డనఘమూర్తి
ప్రళయకాలమున వరాహలీల నటించు
                        నద్భుతచరితుండు నైనశౌరి


గీ.

వర్మధరు లైన పరిపంథివరుల దృక్క
నీనికలయందుఁ బ్రహరించి నేర్పు మీఱఁ
గార్ముకమునందు సూక్ష్మలక్ష్యతయె గాని
వితరణులయందుఁ బోలె స్థూలతయు లేదు.

183