Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్వంబు నొందిన వీరులు దేవత్వంబుఁ బ్రాపించిరి నిపాతితసుహృ
త్స్వామిపితృవ్యభ్రాతృమాతులంబైన సమరాంగణంబు పాణి
నీయవ్యాకరణంబు పగిది దురవగాహంబై యుండెఁ దురంగఖుర
రథనేమిసమద్ధూతమహీపరాగంబు మింటి కెగసి యంధకార
బంధురంబు గావించి దృష్టిప్రసరణంబు లేకుండ నిరోధించుటయు
నంతలో మదోత్కటకరటిఘటాకటవిగళద్ధానసలిలాసారంబున
నవి యడంగుటయుఁ బదంపడి యోధాగ్రేసరులు వీరావేశంబు
నం దలపడి సర్వాస్త్రశస్త్రపాతంబుల మహాసంగ్రామంబుం
గావించి రందు విదీర్యమాణపుష్కరాకీర్ణంబులును బతచ్ఛంఖ
సంఘాకులంబులును ప్లపమానపత్రరథంబులు నగు సంధ్యాకాల
మేఘవర్ణనవర్ణరక్తవారిప్రవాహంబు లనేకంబులు ప్రవహించె
భూతభేతాళపిశాచగణంబులును గాకకంకగృధ్రాదిపక్షిసంఘం
బులును మేదోమాంసమస్తిష్కంబులును భుజించి కడుపులు నిండ
రుధిరంబులు గ్రోలి కలకలారావంబులు గావింపుచు నృత్యంబు
సేయుచుండె.

168


క.

గతమౌర్విచాపములదే
నలిచిత్రము బహుళతహ్రదాన్విత మగుచున్
వితతాయోధనమేదిని
సతతంబు వెలుంగె వృష్టిజలదముమాడ్కిన్.

169


క.

బలమధ్యంబునఁ గెడసిన
బలవంతునిఁ జూచి యతనిబంధులు దుఃఖా
కులులైరి నిహతకుంజర
ముల మెడఘంటలును మిగుల మ్రోయకయుండెన్.

170


గీ.

రణనిహతదంతిదంతగాత్రప్రకీర్ణ
యగుచు రణభూమి పిష్టలో శాసుమృత్యు
ముసలభాస్వదులూఖలవిసరకీర్ణ
యైన చందానఁ జూపట్టె నద్భుతముగ.

171


గీ.

మానవంతుండు చైద్యుఁ డిమ్మాడ్కి రణ మొ
నర్చుచు విధూతచైద్యాన్యనరుల నరులఁ
బరగ నభ్యవరోధంబు వలనఁ దూలఁ
దోలెఁ బవనుండు ఘనములఁబోలె నపుడు.

172