మఱియు నయ్యుద్ధంబు పునఃప్రవర్తితోచ్చలితలబ్ధశుద్ధిపదాదు
లచేత గాంధర్వం బక్షరవిశేషంబులచేతంబోలెఁ బ్రకాశించె నిజ
ఖడ్గంబుచేత శత్రుమండలాగ్రంబులు ఖండింపుచున్న యొక్క
వీరుండు కీర్తిప్లుతమహీమండలాగ్రంబైన యనింద్యత్వంబు
ప్రాపించె మఱియొక్కవీరునిచేత సముద్యతంబైన ఖడ్గంబు
చేత నపరిమితంబైన శత్రుసైన్యంబు శీఘ్రంబున నతిమాత్ర
కలుషంబుగాఁ గావింపబడియె సహస్రరక్షకుండు సహస్ర
హంతయు నైనయొక్కభటుండు తనఖడ్గంబుచేత సహస్రంబును
వధించి యందులో నొక్కకబంధంబు నృత్యంబు జేసినం జూచి
తనచేత సహస్రంబు హతంబయ్యెఁగదా! యని సంతోషంబునఁ
దానును సేనామధ్యంబునఁ నృత్యంబు గావించె మఱియొక్క
భటుండు శస్త్రవ్రణారూపశోభావదలంకరణభూషితుండై
యలంకరణభూషితుండైన రావణునిభంగిఁ జూపట్టెఁ బరిపంథి
శస్త్రప్రహారంబున నిరస్తోరుయుగ్ముం డగుటం జేసి రక్తసిక్త