Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

గంధము దిగంతరంబులఁ గ్రమ్ముకొనఁగ
నభ్రముననుండి విములబృహత్సుమంబు
హరిసుతునిమీఁదఁ బడియెఁ దుల్యప్రకాశ
విమలతత్కీర్తి గగనభాగమున కెగసె.

146


గీ.

అపుడు కేశప్రచురలోక యైనయట్టి
గాఢసంగ్రామశిరము వికాసికుసుమ
లక్షణునిచేత రమ్యమాల్యంబుచేతఁ
బోలె సుపరిష్కృతం బయ్యె వాలమందు.

147


గీ.

సాదరంబుగఁ బోరుచు నతిరయమున
సమరరాగసమాకృష్టచైద్యసేన
మదనుచేతఁ దటస్థాన్య మనుజసాద
రతను బొందింపఁబడియె సంగ్రామమందు.

148


వ.

ఇట్లు విజయలక్ష్మీసమాలింగితుండైన మకరధ్వజుని విలోకించి
యభిమానవంతుండైన శిశుపాలుండు ప్లవమానకలభప్రమాణ
మహోన్నతతురంగమయు సమాకృష్టకార్ముకమౌర్వీటంకార
ప్రభూతనిర్దోషతుల్యతూర్యనాదయు సయత్ననానావిధరిపు
సమూహగతిభేదవిగ్రహనాశకసాయకయు రణరాగిణియు
హయశ్రేష్ఠనాదకలహాయమానవాద్యయు లోలాసికృష్ణసర్ప
విశేషకులయు సముల్లసలోహకంచుకశ్యామ యగుటం జేసి
యంతకునకు భ్రాతృస్నేహంబున సాహాయ్యంబుగా పంపంగోరి
సాక్షాత్కరించిన యమునానదీతుల్యయుఁ దారసింహనాద జనయు
ననామయయు నగుసేన మత్తధీరగజంబులు గలుగునట్లు యుద్ధ
యాత్రారంథంబునం దవిచ్ఛిన్నరణరాగయు నైన సైన్యంబుతోఁ
గూడ శత్రువులపై కురువణించెఁ దత్సమాగమసంభవమహాకోలా
హలంబు కల్పాంతకాలోద్వేలపారావారరవంబు ననుకరించె.

149


సీ.

అప్పుడు భూపాలకాగ్రేసరులు విచ్చు
                        కత్తులతళతళల్ గ్రచ్చుకొనఁగ
మ్రోల వసించి రావేలశౌర్యానురా
                        గప్రౌఢనికషంబు గాదె శస్త్ర
జీవుల కాజిచేఁ జెలఁగి నిర్మలహృద్య
                        సాంద్రసంపద గల స్వర్గమునకుఁ
బోవఁ దలంచువాఁడే వాఁడు నసిలత
                        ధరియించి యలసపదంబు దాల్చు


గీ.

బాహుదండంబులను ముష్టిపాతనముల
నూరుసంఘట్టనంబుల నుభయబలము