ఇ ట్లతిరభసంబుగా హరిణంబులమీఁదికిం జనుసింగంబుభంగిఁ గవిసిన
ప్రద్యుమ్నునిమీఁద విలసదయోమయకవచు లగుటం జేసి నీల
మేఘసామ్యంబు నొందిన తత్సైనికులు ప్రయోగించిన సువర్ణ
పుంఖసాయకంబులు శంపాలతలకైవడిఁ బ్రకాశించె నప్పు డా
ప్రద్యుమ్నుండు నఖకిరణమంజరీవ్యాప్తయు నధిరూఢశిలీముఖ
యు నైనమహాకార్ముకశాఖను ధరించి మహోన్నతవృక్షంబు
పోలికఁ బ్రకాశింపుచు రిపుసమూహాంతకుం డగుచు నతిభయంకర
యుద్ధంబు గావింపుచు నమ్రులైనవారియందు సౌజన్యంబుఁ
జూపుచు నుద్వృత్తులైన ప్రతిపక్షులబాణంబులచేత విచారింపుచు
మఱియు సర్వమహీపతులు విజయాశంసచేత నగ్రభాగంబునఁ
బ్రయుక్తానేకబాణంబుల బాణంబులచేత ఖండింపుచుఁ గృతా
నేకమాయయై సారవంతంభై యున్న సేనాతతిని ధనుష్టంకార
మాత్రంబున ననాయాసంబుగా మూర్ఛ నొందింపుచు సమర
సన్నాహవిజృంభితుండై విహరింపుచుండ నప్పుడు.