Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నట్టి మనోజ్ఞదివ్యాంగనచేఁ బర
                        లోకంబునం దిహలోకమందు
యశముచే విఖ్యాతిఁ వాపించె మూర్ఛ నొం
                        దిన వారిజీవంబు దివిజలోక


గీ.

మునకుఁ జని యచ్చటివిలాసములను జూచి
మఱలఁ జనుదెంచి వారివర్ష్మంబు సొచ్చె
నంతలో లేచి తత్సౌఖ్య మందఁగోరి
భండన మొనర్చి రప్పుడు చండభంగి.

125


ఆ.

కాండనిహతి మూర్ఛితుం డైనయొకవీరుఁ
దొడరి మిత్రుఁ డనికిఁ దొలఁగఁదీయ
నంతలోనఁ దెలిసి యతఁ డెంతవలదన్న
వినక రణముఁ జేసి విడిచెఁ దనువు.

126


గీ.

పగతుచేత నాకర్షింపఁబడిన వీరు
లిరువు రేశాస్త్రనిర్భిన్నహృదయు లగుచు
సరిపరస్పరావష్టంభశక్తియోగ
కలన నేగిరి నాకలోకమున కపుడు.

127


సీ.

ఖండితడండమై కడువడి ధరణిపై
                        వ్రాలిన పూర్ణచంద్రప్రభాభి
రామాతపత్రంబు శ్రాద్ధదేవుని రౌవ్య
                        భోజనపాత్రంబు పోల్కి నొప్పె
మృతులైన నృపతుల మెడనుండి పడిన స
                        కాశ్మీరహారముల్ కామనహిత
మగు మిత్తిరక్తమద్యము ద్రావి నవ్విన
                        వెలికుబ్బు రదములవిధము దోచె


గీ.

మెండుగా నిమ్నభూములు నిండినట్టి
సాయకక్షతరుధిరంబు శమనయువతి
రమ్యసంవ్యానముల కనురంజనార్థ
మిడిన కౌసుంభరసముకైవడిఁ జెలంగె.

129


చ.

క్రమమునఁ బెక్కుమాఱులు ధరావతుల న్వధియించి పెద్దగా
లమునకు జామదగ్న్యుఁడు చలంబునఁ దద్రుధిరంబు పంచస్రో
తములుగఁ జేసె నాసమరధారుణియందు క్షణంబులోన నే
కములగు రక్తవాహిను లఖండముగాఁ బ్రవహించె నత్తఱిన్.

130