Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్తావార్యామితహేమపుంఖపటుబాణౌఘంబు లొక్కుమ్మడిన్
దేవస్త్రీకరముక్తమాల్యములతోఁ దెల్వొంద వ్రాలెన్ రహిన్.

121


వ.

మఱియు సాయకోక్షిప్తసాదిశూన్యాసనంబు లగుటం జేసి పర
సైనికులచేత గ్రహించుటకు సమారబ్ధంబులై రణభూమియందుఁ
బరిభ్రామ్యమాణంబు లైన మత్తేభబృందంబులచేత బంధసంస్థానం
బు స్మరింపబడియె సంగ్రామరంగంబునందుఁ బునఃపునరావృత్తి
వలన రక్తగంధాఘ్రాణనంబుచేత మత్తంబైన మహాగజంబు
కోపంబువలన జనమర్దనంబు సేయుచుఁ బాదలగ్నం బైన పాశబం
ధనసంకాశదీర్ఘాంత్రమాల నాకర్షించె మఱియునొక్కవీరుండు
గాఢప్రహారంబువలన మూర్ఛాకాంతుండై మదవారణశీతల
పుష్కరతుషారసిక్తుం డగుటం జేసి మూర్ఛఁ దేరియుండ వాని వరిం
చుటకుఁ జనుదెంచిన దేవాంగన సజీవుండై యుండుట యెఱింగి
విఫలమనోరథ యగుచు మూర్ఛ నొందె మఱియునొక్కవీరుని
శిరంబు సాయుకలూనంబయి మింటికెగసిన దానింజూచి వర
ణార్థంబు చనుదెంచిన దేవకామినులు స్వర్భానుం డని శంకించి
భయంబున సుందరాకారంబులైన ముఖచంద్రులఁ బ్రత్యన్ముఖం
బులు గావించిరి.

122


చ.

పటుగతి నాత్మభర్త పరబాణహితుండయి నేలఁ గూలినం
దటుకునఁ జూచి తద్యువతి తద్విరహంబు సహింపలేక తా
నటు ప్రబలాగ్నిలో నుఱుకునంతటిలో నొకదేవకాంత ము
చ్చటపడి వానిఁ గొంచు సురశైలమహాగుహఁ జేరె గ్రక్కునన్.

123


క.

అనిఁ గెడసిన భర్తను ద
ద్వనిత కరటి నెక్కి చూచి తద్దయుమోహం
బునఁ దనువు విడిచి గ్రక్కున
ఘనదేవత్వంబు నొంది కౌఁగిటఁ జేర్చెన్.

124


సీ.

మఱియొక్కవీరుండు చిరకాలమును నాక
                        వాసము గావించి ప్రత్యహంబు
నతిశయప్రేమచే నభినవత్వము నొంది
                        నరులకు నభినవానంద మొసఁగి