Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కరటిఘటాకటనిస్రుత
సురుచిరమదధారరోషశోణితమగుచున్
గురుతరబాణక్షతగళ
దురుశోణితధారపగిది నొగిఁ బ్రవహించెన్.

110


చ.

తఱుచుగ రత్నచిత్రితకుథాపరివేష్టితదంతికాయముల్
స్ఫురితపృషత్కజాలములు సోఁకి పగిల్చిన తత్పృథుక్షతో
త్కరగళితాసగుచ్ఛతరధారలు గాఱఁగ సాగె భూరిభూ
ధరములనుండి జాఱు వితతస్ఫుటవాహిను లట్ల సాంద్రమై.

111


సీ.

శమనశయ్యాతివేషాదండములఁ బోలు
                        సామజదంతము ల్సాహసిక్య
మునకెక్కి యన్యుండు ఘనతరస్వర్గార్థ
                        మార్గంబు నెక్కిన మనుజుఁ డనుచుఁ
దత్క్షణంబునఁ జమూతతులచే మిగుల
                        నుత్ప్రేక్షింపఁబడియె నహీనభంగిఁ
గౌముదీబిందుసంకాశవిశుద్ధ
                        ఖడ్గాఘాతదారితహస్తిరాజ


గీ.

భూరికుంభసముచ్చలచ్చారుమౌక్తి
కౌఘమాకాశము నుదారకాంకితముగఁ
జేయుచున్నవిధంబునఁ జిత్రభంగిఁ
గాననయ్యెను సువిశాలకాంతి యగుచు.

112


వ.

మఱియునొక్కమత్తకరీంద్రంబు దూరోత్‌క్షిప్తసత్వరచక్రనికృత్తంబై
పుడమిం బడి లోలమానంబైన భయంకరస్వకీయహస్తంబును రోషస
హితం బగుచుఁ బంకీభూతశోణితంబైన తనపాదంబుచేతనే మర్దించె
మఱియునొక్కగజంబు విలూనజంఘం బగుటంజేసి యధోముఖంబై
యనాధారంబుగాఁ బుడమిం బడుచుండ దాని కతిదీర్ఘస్వకీయదంతద్వ
యంబె యాధారత్వంబు నొందె మఱియు నొక్కభటుండు దంతంబు
లూఁతగాఁ బుడమికి మ్రొగ్గతిలంబడిన మహేభదంతమధ్యంబునం జి
క్కి యొక్కింతయుపాయబలంబునఁ గరకలితనిశాతమండలాగ్రం
బున దానిహస్తంబు దెగవేసి దంతంబులు చూర్ణంబుఁ జేసి తా నక్ష
తుండై నిర్గమించె.

113


గీ.

మొనసి దుష్టదంతిమ్రోల నిర్భీకుఁడై
యున్నభటుని నెత్తి వ్యోమవీథి