Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కరించుటకు శక్తంబు గాదయ్యె మఱియుఁ గులీనాశ్వంబు హయా
రోహకునిచేత నున్నతంబైన కుంతంబునఁ బ్రహరించుట కభిప్రే
తం బైనగజంబువలన భయంబు నొందదయ్యెఁ గులీనులు
యశంబుకొఱకు మహాపౌరుషంబు గావింప నుద్యుక్తులైన నిజ
భర్తలను లజ్జితులుగాఁ జేయరుగదా! మఱియు నధోదేశంబున
జనంబును విలోకింపుచు విక్షిప్తసాయకహస్తులును భయరహి
తులు నగుజయశీలురు గజంబుల నారోహించి జంగమంబులగు
గిరిదుర్గంబులు నాశ్రయించినవారియట్ల శత్రుసైన్యంబులచేత
జయించుట కశక్యులై యుండిరి యొక్కవీరుండు సర్వవ్యాప
కంబులగు సైన్యతరంగంబుల నీవలావలం దట్టుచు సమరమధ్యం
బున దూరంబునంబోవు నిష్టబంధువును విలోకింప నిశ్చయించిన
వాఁ డగుచు నొకచోట దూరంబున మగ్నం బైనమహీమండలంబు
నవలోకించుట కాదివరాహంబు సముద్రంబునందుంబోలె రణ
రంగంబునం బరిభ్రమించె గజోద్ధావనజ్ఞుండగు యాధోరణుండు
మదోద్ధాపనార్థం బుద్దీపనకర్మంబు గావింపం దలంచు నంతకు
మున్నె సేనాకోలాహలశ్రవణంబువలన స్థూలంబు లైన గజం
బుల మహాదానప్రవాహంబులు తమయంతఁదామె ప్రవహించె
దూరంబున నవ్యగజమదగంధాఘ్రాణంబువలనఁ గ్రోధావేశంబై
దాని హింసించుట కొకగజంబు విధూతమస్తకంబై యాధో
రణునిం దిరస్కరించి దారుణాక్రందనధ్వనికృతాశేషదిగంతం
బైన స్వకీయవింశతివార్ధికంబైన గజడింభంబునందుఁ దిర్యగ్దంత
ప్రహారంబు గావించె మఱియు నొక్కప్రతిపక్షవారణంబు
ప్రత్యాసన్నం బగుచుండ గజారోహకునిచేత సంప్రాప్తముఖ
చ్ఛదం బయ్యునుఁ గ్రోధాతిశయంబునఁ గ్రూరనిర్ధారికాక్షం
బయ్యుమ మదాంధగంధసింధురం బొక్కించుకైనఁ బురోగత
ప్రతిపక్షగజంబును విలోకింప దయ్యె.

103