Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షణములోన వసుంధరాచక్ర మెల్ల
నిండెఁ గలకలనాదంబు మెండుకొనఁగ.

73


వ.

అప్పుడు క్షణమాత్రం బగ్రభాగంబున విలోకింపుచున్న తనుకుక్షి
స్థితభువనత్రయుండైన మధుసూదనుని విశాలనితాంతాయత
నేత్రంబునందుఁ దద్విపక్షమహాబలం బపర్యాప్తం బయ్యె మహీ
నాథసేనావధూగణంబులు రణారంభంబునందు సురతారంభంబు
నందుంబోలెఁ బ్రస్విన్నగాత్రంబులును బులకవికాసితంబులును
వీరశృంగారరసాధికంబైనచిత్తంబునం దభినివిష్టసాహసంబులు ను
పసంభ్రమంబులునై జూప మఱియు శిశుపాలపక్షరాజు
లనుకూలమారుతప్రసారితకేతనపటంబులచేతఁ బలాత్కారంబు
గాఁ గృతాహ్వానులైనచందంబున ధృతతరంబుగా సముద్యత
శస్త్రాస్త్రు లగుచుఁ గోపంబున నత్యంతసంరంభంబు నొందిరి ధీరు
లగువారు రణార్ధులై చనుదెంచినవారిం జూచి కాలవిలంబనంబు
సహింపరు గావున నప్పుడు హరిసైనికులు శత్రువాహినిమీఁద
నతిరయంబున నడరి రంత.

74


చ.

జరఠకపోతకంఠగతసాంద్రతనూరుహజాలచారుధూ
సరరుచి యైన సైనికుల సచ్చరణాహతభూరిధూళి యం
బరపథ మంటఁ బై కెగసి బంధురమేఘచయంబు గ్రమ్మి చె
చ్చెర దెస లావరించి యతిశీఘ్రతఁ జేసె ఘనాంధకారమున్.

75


సీ.

మఱియుఁ జలాచలఖురములచేఁ బ్రతి
                        పద మాహతములయ్యు బహుళసాంద్ర
ముగ నిషంగులచేత మిగుల మిథస్సమా
                        శ్లిష్టకాయంబులచేతను బరి
రుద్ధంబు లైనప్రసిద్ధపాంసుచ్ఛట
                        లొకచోట మీఁదికి నుద్గమింపఁ
జాలక క్రిందనే సంచరింపుచునుండె
                        మఱియు మహోగ్రసంగరము మీఁదఁ


గీ.

గలుగునప్పుడు సాయరక్షతజరక్త
జలముచేఁ బంకిలత్వంబు గలుగు మనకు
నిపుడె యాకసమున కేగు టుచిత మనుచుఁ
బవనకేతుసమూహ మభ్రమున కెగసె.

76


గీ.

ప్రచురముఖుఁడు గరీయుండు రాగియైన
జలజగర్భుని వ్యవహితసత్వరజము