Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్థిరతరవారిబిందువులచే ఘనవైరవిభిన్నగాత్రజ
స్ఫురదురు రక్తసక్తుఁడగు పోలికనొప్పె గవేషణుం డొగిన్.

57


చ.

చటులతరాధికోపవిలసచ్చినిపాదతలాభితాడన
స్ఫుటితభవన్మహీవివరపుంజవితీర్ణబిలంబు లై జనో
త్కటకరముల్ రసాతలము తప్పక సొచ్చి యొకింత తాపసం
కటము నెఱుంగనట్టి యురగంబులకుం గలిగించెఁ దాపమున్.

58


ఉ.

మానుగ సారణోర్విపతి మాటికిఁ గోపవశంబునన్ శిరో
ధూనన మాచరింప శిఖితుల్యతదగ్రసువర్ణసత్కిరీ
టానుగతోరురత్నరుచు లాజికి నేగెడు రాజరాజికిన్
జానుగ భవ్యదీపము లొసంగినభంగిఁ జెలంగె నయ్యెడన్.

59


చ.

విశతబృహద్భుజాలతుఁడు వీరవరుండు విదూరథాఖ్య భూ
పతి యొకమాటఁ జెప్పుటకు వారక విచ్చిన దౌటఁ జంచలో
న్నతరసవాగ్రమైన లవనస్ఫుటకందర మొప్పె భోగిసం
యుతవనవృక్షకోటరము నొప్పున నప్పుడు భీకరాకృతిన్.

60


గీ.

శాత్రవోక్తుల నిట్లు తత్సదన మపుడు
క్షోభ మొందుచునుండ ముకుందమాన
సంబు గలఁగదు వారిదజలముచేతఁ
గంధిజల మించుకైనను గలఁగనట్లు.

61


గీ.

పరులు నిందించుటయుఁ దన్ను బ్రస్తుతించు
కొనుట ఖలులకు భువి నైజ మని తలంచి
యుద్ధవుఁడు కోప మూనకయుండె నతని
ముఖము స్మితయుక్తమై చంద్రు బోలి యుండె.

62


వ.

ఇట్లు ప్రకటితప్రకోపులైన యాదవులచేత శిశుపాలప్రేషిత
వచోహారకుండు నిరాకృతుండై మెల్లనం జనిన యనంతరంబ
దుస్సహస్వనభయానకంబులైన యానకంబులుగల హరిబలంబు
తత్క్షణంబ యుద్ధసన్నద్ధం బయ్యె యదునరేంద్రులు కవచధార
ణంబు న్యాయంబని యనేకవారంబులు భగ్నప్రతిపక్షాయుధం
బులును బరాక్రమానుగతప్రకర్షవంతంబులు నద్రికటకనిర్భ
రంబులు నసంత్యక్తశౌర్యదంశనంబులు నగుశరీరంబులయందు