Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దాలిచి తదాజ్ఞ పరిభాషలీల నొందు
మిగుల బాధింపబడకుండు జగతియందు.

46


వ.

తొల్లి పురాణపురుషుండు ధృతవరాహశరీరుండై హిరణ్యాక్షాది
రాక్షసదంష్ట్రాక్షతయైన యీధరిత్రిని ముహూర్తమాత్రంబు
ధరించె నిప్పుడు సంహృతసకలవిపక్షుండైన యీరాజు
చేత ననుపధృతయైన యీధరిత్రిని చిరకాలంబున
నుండి ధరించి యున్నవాఁ డీయిరువురలోన నధికుం
డెవ్వండో విచారింపుము మఱియు నమ్మహారాజగుణ
తరంగంబులును సముద్రతరంగంబులును రెండు ననం
తంబులై మిక్కిలిఁదుంగత్వంబు ధరించియుండు నైనను సముద్రమహోర్ములు తీరంబు ప్రాపించి నశించు నారాజ
గుణమహోర్ములు పాఠంబు నొందియు నశింపకుండు
నట్లగుటంజేసి సముద్రమహోర్ములకంటె నారాజగుణ
మహోర్ము లాధిక్యంబు నొంది యుండు.

47


సీ.

యాదవనాథ! లోకాలోకరుద్ధవి
                        హార మౌట నదృష్టమైన దుస్స
హార్కతేజంబు లోకాగ్రమం దుచ్చావ
                        నీభృత్తులను దాఁట నేరదయ్యెఁ
జేదీశు తేజోవిశేషం బుపశ్యజ్జ
                        నాగ్రమం దతిదృష్టమై సమస్త
భూభృత్తులందు సంపూర్ణమై వ్యాపించె
                        హరికన్న నతఁ డెక్కు డగువో కాఁడొ


గీ.

యతని పరిపంథియువతులు గతపటీర
యావకాంజనమేఖలాహార తనువ
రాధరాక్షినితంబకుచాఢ్య లగుట
వలన నిత్యవిభూషలై యలరుచుండ్రు.

48


చ.

అతులితశౌర్యశాలి యగు నాశిశుపాలుఁడు పోరిలోన నిన్
జతురతఁ జంపి రోదన మొనర్చు భవత్సతి బాలపుత్రులన్
సతతము వైరమున్ విడిచి సత్కృపఁ బాలన మర్థిఁ జేయుచున్
క్షితితల మందు సార్థముగఁ జేయును బో శిశుపాలనామమున్.

49


చ.

అలయక నిట్లు వాగ్మియగు నా శిశుపాలుని దూత దిట్టయై