Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జేసి స్వజనబంధుండైన శిశుపాలునకుఁ బత్నియైన రుక్మిణి నపహ
రించుటవలనఁ బరిత్యక్తధర్మార్థుండవై కేవల కామమాత్ర
నిష్ఠుండవు పరదారాపహారకుండవు బంధుద్రోహివి రాజ
ద్రోహి వైతి విది పరమసాహసికత్వంబు నీ వజ్ఞాతరూపవిశేషుం
డవు సర్వగతుండవు పరభృతపక్షకాంతి వట్టి నీకుఁ దిమిరంబు
నకుంబోలెఁ జైద్యుండు సూర్యుండునుండోలె వినాశకరుండగు
నట్లుగాకుండ నేనైన సాంత్వవాక్యంబుల మహాక్షుభితుండైన
శిశుపాలునకుఁ గోపోపశమనంబుఁ జేసి నీయం దనుగ్రహంబు
గలుగునట్లు చేసెదనంటినేని వేల నతిక్రమించి వెల్లి విరిసివచ్చు
సముద్రప్రవాహంబును జగత్కృతజలనిర్గమమార్గం బేమి
సేయంగలదు యుద్ధంబు కొఱకు యాదవసహితంబుగా ని
న్నాహ్వానంబు సేయుట కేను చైద్యునిచేఁ బ్రేషితుండనై వచ్చిన
వాఁడ మహావీర్యులగు మహీపతులు పరులయందుఁ బాటచ్చరుల
కరణిఁ గపటంబుచేత నపకారంబు గావింప రమ్మహీపతి రణార్థియై
మహానదీప్రవాహంబుభంగి వచ్చుచున్నవాఁడు నీవు తీరగత
వృక్షవృత్తి నాశ్రయింపక వేతనవృత్తి నాశ్రయించి నిన్ను
రక్షించుకొనుము.

31


చ.

పరువడిఁ జేదిభర్త శిశుపాలుఁ డతండు మఱుంగు సొచ్చినన్
దరుణులఁ బ్రోచునే? యని మనంబునఁ జూడకు మమ్మహీసుధా
కరుఁడు దయాసముద్రుఁ డటుగావునఁ దన్ శరణంబు నొందినన్
దరుణులఁ నైనఁ బ్రోచు నతిధార్మికుఁ డాతని కెవ్వ రీడిలన్.

32


చ.

చతురత స్వార్థలిప్సులగు శాత్రవులెక్కుడు వానికిన్ సము
చ్ఛ్రితగతి విప్రియంబు దగఁజేయక యుండరు శంకచేత న
ప్రతిమగుణాకరుండు శిశుపాలుఁ డుదారుఁడు గాన నీవు నం
చిత మతిభక్తితోఁ బ్రణతిఁ జేసిన మాత్రనె బ్రోచు సత్కృపన్.

33


చ.

విను నపు డప్రియంబులయి వీనులు సోఁకిన పల్కు లవ్వలన్
ఘనసుఖ మిచ్చుఁ దా వినెడు కాలమునందు నతిప్రియంబు లై