Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్వాభావ్యంబువలన సుభాషితంబైన హితోపదేశవచనంబు
దురాగ్రహగ్రస్తచిత్తు లగువారియందు సూర్యానురక్తంబు
లగు పద్మాకరంబులయందు జంద్రకిరణజాలంబులుఁబోలె
నిరర్థకంబగు మఱియు.

27


సీ.

పార్థివోత్తమ! శిశుపాలుని వర్ణించి
                        భీమాగ్రజుఁడు నిన్ను బెద్దఁ జేసి
పూజించెఁ గావునఁ బుడమిలో గుణదోష
                        ములు విమర్శించక మూర్ఖజనుఁడు
తనయిచ్చకొలఁదిఁ గ్రన్నన జేయు ననుమాట
                        కిదియె ప్రమాణమై యెసఁగుఁ గృష్ణ!
తలఁప నీపై భక్తి గల యమసుతునిచేఁ
                        జేదీశ్వరుండు పూజింపఁబడక


గీ.

యున్న నేమి? యన్నరోత్తముండె గురుండు
పరగ మాంసలుబ్ధహరి విస్పష్ట
మత్తకరిశిరస్థమౌక్తికరత్నంబు
లోకపూజితంబు గాక యున్నె?

28


గీ.

అమలుఁ డమలులచేఁ బూజ్యు డై వెలుంగు
మలిను లగువారిచే నధఃకలితుఁ డగును
శివుఁడు శిరమున ధరియించె దివిజనదిని
హరి పదంబునఁ దాల్చెఁ బ్రత్యక్ష మిదియ.

29


గీ.

అజ్ఞపార్థకృతార్ఘప్రహర్షితుండ
వైన నీ కెట్లు గలుగు యోగ్యత? సహమునఁ
బ్లవగసేవిత కాకఫలంబు లుష్ణ
తను వహింప వెన్నటికైన వనజనేత్ర!

30


వ.

యాదవేంద్రా! నీవు శిశుపాలకృతాపరాధశతంబు సహించి
యున్నవాఁడ వని శినివరుండు పలికె నది యొక్కఘనంబు గాదు
రుక్మిణీహరణంబునందుఁ జైద్యుండు సమర్థుండయ్యు ననేక
శతాపరాధతుల్యం బైన భవత్కృతమహాపరాధంబు సహించి
యున్నవాఁడు రాజులకు రాక్షసవివాహంబు ధర్మం బగుచుండ
నది యపరాధం బెట్లయ్యె నని యంటివేని

శ్లో. హత్వాచ్ఛిత్వాచ భిత్వాచ క్రోశంతీం రుదతీం తథా
    ప్రసహ్య కన్యాహరణం రాక్షసో విధి రుచ్యతే॥

యను న్యాయంబునఁ గన్యాహరణంబు గావించిన నది రాక్షస
వివాహం బనంబడు బితృమాతృభ్రాత్రాదులచేత దత్తయగుటం