Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

చతురత మీ విభుండు దగ సంధి యొనర్చుట నిక్క మేని నం
భృతమతి యుద్ధసన్నహన మేటికిఁ జేసె మహాత్మ! శౌరి ను
ద్ధతి వెఱపింపఁ జేసె నొకొ తన్మహిమం బెఱుఁగండె? వ్యర్ధ మీ
యతులప్రయాసమంతయు భయంపడునే హరి యింతమాత్రకున్.

21


ఉ.

పండితమానియైన శిశుపాలుఁడు శౌరిసమక్షమంబునన్
మెండుగ దుష్టవాక్యములు మిన్నక పల్క శతాపరాధముల్
నిండినదాఁకఁ బైఁదెగుట నీతియుఁగా దని యోర్చె నన్నియున్
నిండెఁ గొఱంత లే దిఁక ననిన్ వధియింపఁగలాఁడు చైద్యునిన్.

22


గీ.

విను మనర్గళగోపురాననుఁడ వీవు
పలికిన దురుక్తి సమయంబు గలయవచ్చు
నంతదాఁక రోషానలు నడ్డగించె
నింకఁ బలికిన దండ్యుండ వీవు నీచ!

23


గీ.

శినిమనుమఁ డిట్లు పలుక నా చేదినాథ
వాక్యహరుఁ డతిదుష్ట తద్వచనము విని
త్యక్తిసాధ్వనుఁడై నేర్పు దనర మరల
నిట్టు లని పల్కె వినయంబు నెసఁగ మెసఁగ.

24


ఆ.

బుద్ధిశూన్యుఁడైన పురుషుండు పరులచేఁ
జెప్పఁబడిన యంత చేయఁజాలఁ
డూహ చేసి కొన్నియుక్తులు గల్పించి
చెప్పె ననుట చాలఁజిత్ర మరయ.

25


గీ.

అరయ సువివేకి యాగామ్యనర్ధముల నె
ఱుంగుఁ దనయంతఁదానె పరుండు చెప్పఁ
దెలిసికొని విశ్వసించుఁ; దాఁ దెలియ లేఁడు
పరుఁడు చెప్పిన వినలేఁడు బాలిశుండు.

26


వ.

యదువరా! యే నిప్పుడు సంధియ గుణం బనియు విగ్రహం
బనర్థం బనియు నెమ్మది పలికితి నవ్వచనంబు నీకును గుశలంబగు
సుజనులు ప్రబలవిరోధంబువలన స్వవినాశహేతుభూతకార్య
కరణోద్యుక్తులైన పగతులయందును హితోపదేశతత్పరులగు
దురు నాచేత సముదీరితంబు లైన యీ రెండుపక్షంబులలోన నీకు
నెయ్యది శుభోదర్కంబగు దాని విభజించి కావింపుము సుజన