యదువరా! సాధ్వసుండ వనపత్రపుండవు నతిమాత్రోజ్ఝితభ
యుండవు ననాస్తికుండవు నవిస్మయుండవు గావునఁ ద్వత్సదృశమహాగుణవంతుం డెక్కడ లేఁడు కృతగోపవధూ
రతివి వృషఘ్నుండవు విగతపాపుండవు నగు నీదుభయం
కరనరకప్రతిపత్తి యిప్పుడు జనంబుచేత మిక్కిలిఁ బ్రకటింపం
బడియె సానుచరుండవుగా మహీభృద్విహితాపచితివియు
బలంబులచేత ద్విషత్సమాహితసాధ్వసుండవు నయి మహామహి
భృదుపరిప్రదేశంబున నుణ్డుము. నీనగరంబునందలి వీథులు
ఘనజాలనిభవనజమృగాదినాగకదంబకంబులచేతఁ బరికీర్ణంబులై
దురాసదంబులు గాఁగలవు విహితచేతస్కుండవైన నీశత్రుండు
సకలాపిహితనిజపౌరుషుండును నియతవ్యాపదవర్దితోదయుం
డును సతతవ్యాధియు ననీతియు నగుంగాక. రభసంబు వలన నుపాగతుండైన చైద్యుని సబలుండవు సగదుండవు నైన నీవు సమితియందు సంభావించుట కర్హుండ వగుదువు. రణంబుల
యందు శత్రునిషూదనుండైన శిశుపాలునితోడంగూడి చిర
కాలంబు సహసర్వసాత్వతుండవై విశ్వస్తవిలాసినీజనుండవు
గమ్ము. ఈ శిశుపాలుండు విజితక్రోధుండవు నసకృజ్జితసంయ