Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిశుపాలవధ మహాకావ్యము

చతుర్థాశ్వాసము

క.

శ్రీరుక్మిణీశచరణాం
భోరుహపూజావిధేయ! భూరిగుణాలం
కారరసకావ్యనాటక
సారవిశారద! నమస్తజననుతచరితా!

1


వ.

అవధరింపు మవ్వలికథ యెట్లనిన నిత్తెఱంగున వసుమతీపరివృఢు
లందఱు సేనాసన్నాహంబు గావించిన యనంతరంబ దమఘోష
నందనుండైన శిశుపాలునిచేతఁ బ్రస్థాపితుండై సమయసముచి
తోత్తరస్ఫురణశక్తిమంతుండైన యొక్కదూత సభాసదనం
బున నాసీనుండైన హరియొద్దకుం జనుదెంచి ప్రియాప్రియ
రూపార్థాభిదాయకంబైన వాక్యంబున నిట్లనియె.

2


చ.

అరుదుగ మున్ను నీ వచట నర్ఘపరిగ్రహణంబు సేయ న
త్తఱి శిశుపాలుఁడెంతయును దాదృశవిప్రియముల్ వచించి క్ర
మ్మర ననుతాపముం గలిగి మానుగఁ దా నరుదెంచి రోషసం
భరితుని నిన్ను శాంతుడఁయి మన్నన సేయఁదలంచె నెమ్మదిన్.

3


చ.

స్థిరమతి నున్మనస్కుఁడగు చేదిమహీశుఁడు సత్వరంబుగా
నఱమఱఁ బోవఁబెట్టి ప్రచురాధిగతాంగసుఖుండవైన నిన్
జిరవిపులోరునిగ్రహముచేఁ దగనిర్దయపీడనంబు దా
నురువడిఁ జేసి సమ్మదము నొందునుగాక నితాంత మచ్యుతా!

4