Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వంశస్థ.

సదానతారాతిప్రసాదదాయకా!
సదానతోయార్ద్రలసచ్ఛయాంబుజా!
విదగ్ధకాంతాజనవీక్షణస్పృహా!
ప్రదాంగసౌందర్యవిభామనోహరా!

303

(గద్య)
ఇది శ్రీరామచంద్రకరుణాకటాక్షలబ్ధవిద్యాసాంద్ర గోపినా
థ వేంకటకవీంద్రప్రణీతంబైన శిశుపాలవధ మహాకావ్యంబు
నందు సూర్యోదయవర్ణనంబును దత్కాలోచితనానావిధ
వినోదవర్ణనంబును రైవతకపర్వతంబుననుండి యింద్రప్రస్థ
పురంబునకుం బునఃప్రయాణవర్ణనంబును రథగజహయపదా
తులగమనవిశేషవర్ణనంబును మాధవుండు సర్వసైన్యసమే
తంబుగా ననేకనదులు పర్వతంబు లుత్తరించు మార్గస్థిత
గ్రామంబు లన్నియు విలోకింపుచు యమునానది డాయం జను
టయు యమునానదీవర్ణనంబు నమ్మహానది నుత్తరించుటయు
హరిరాక విని ధర్మనందనుండు తమ్ములుం దానును సర్వసై
న్యసమేతంబుగాఁ జనుదెంచి కృష్ణు నెదుర్కొని రథారూఢునిం
జేసి మహావైభవంబున నింద్రప్రస్థంబునకు దోడ్కొనిపో
వుటయుఁ బురస్త్రీవర్ణనంబును సభావర్ణనంబును హరిసభా
సదనంబు ప్రవేశించుటయు ధర్మరాజు రాజసూయయాగారం