Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వెలువడు బాష్పతోయములు నించకయుండెను గాని పోరమే
ల్దలఁగఁగ జాఱి కంకణ మిలం బడు టాత్మ నెఱుంగ దెంతయున్.

294


చ.

పొసఁగ నవోఢయోర్తు పతి పోరికి నేగెద నంచుఁ బల్కినన్
వస మఱి పోయిరమ్మనుచుఁ బల్కఁగనేరక యూరకుండి బల్
వ్యసనముచేత వల్లభునిపాదముపై నిగళంబుబోలె ను
ల్లసితవినీలపంకజదళచ్ఛవినేత్రము నించె నత్తరిన్.

295


చ.

అవశకునాతిభీతిమెయి నంబిక పల్కిన తర్జనోక్తులం
దవిలి వివృద్దమన్యుఁడయి తప్పక బాలకుఁ "డెందుఁ బోయె దీ
వవిరళభంగిఁ? దాత!"యని యాడఁ దదస్ఫుటవాక్య మెంతయున్
దవశిఖి మాడ్కి నజ్జనకుధైర్యము నీఱుగఁ జేసె నత్తఱిన్.

296


సీ.

మఱియొకసతి శతసురలోకగతకామి
                        నుల సురతసుఖంబుఁ దలఁచి తిప్ప
డయ్యప్సర స్సురతానంద మది నేఁడె
                        యబ్బినట్లుగ నవ్వె దనుచు నీర్ష్య
చేఁ బల్కె; మఱియొక్కచేడియ ప్రాణేశుఁ
                        డనికిఁ బోవుచునుండ నశ్రుజలము
ధవునకుఁ గీడని ధార్యమాణంబయ్యు
                        నెగడు దుఃఖంబున నిలువలేక


గీ.

మోచనముఁ జేసె నకపటబుద్ధులైన
కాంతలకు సంవరణమె యుక్తంబు వెలది
చెక్కులను డిగ్గు నంజనసిక్తబాష్ప
ధార శోకాగ్నిపదవిచందాన నొప్పె.

297


చ.

బిఱబిఱఁ గొన్నిపాదములు వెట్టి ప్రియుం డతిశోకసాదమౌ
తరుణి విలంబిహస్తమునఁ దప్పక క్రాలెడుకంకణంబులుం
దఱుచుగఁ దత్ప్రకోష్ఠములు దాఁకఁగ జాఱిన తన్నినాదమున్
గర మది తుమ్మటంచు క్షణకాలము పోవకనిల్చె నత్తఱిన్.

298


సీ.

వల్లభతముఁడైనవానిముంగల గాత్ర
                        సాదంబు వలన విస్రస్తనిర్మ
లాయతాంశుకయయి యవని నభంబున
                        నతిరభసంబుగా నరుగు నొక్క
రమణి మహోల్కతో సమముగాఁ జూపట్టె
                        జననాథనికరంబు జన్యమునకు
నరుగంగఁ దత్సహమరణోద్యతైకమా
                        నసయయి మిగులదైన్యంబు నొంది