Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.⁠

ధౌతముఖగతహేమమండనములందు
విలసదినమండలము లౌట వెలికిఁ బర్వి
నట్టి దర్పంబు గలవానియట్ల నలరు
నతనుదేహాశ్వములు ధాత్రి నావరించె.

⁠ 287


గీ.⁠

చక్రమండలోత్థచటులపరాగాభ్ర
వలయమధ్యవర్తివరరథములు
సాంద్రఘోషభీతజంతువుల్ గలుగున
ట్లశనులుక్రియఁ బఱచె నతిరయమున.

⁠ 288


గీ.⁠

సంభృతోరశ్ఛదం బౌట శశకలాంఛి
తేందురుచి యగుదేహంబు నొందినట్టి
రాజులు యథార్థసంసిద్ధిరహితమధువుఁ
ద్రావి రుత్సాహవర్ధనార్థము ససతులై.

⁠ 289


మ.⁠

కమలాక్షీమణి భర్త కాసవ మొసంగన్ సాసవం బైన కాం
స్యమయాంచచ్ఛషకంబు నెత్తి వసమించ న్వాసనార్థంబు సం
భ్రమత న్నించిన పద్మగ్రంధము గ్రహింప న్వాలు భృంగౌఘభా
రమునన్ గ్రక్కున నేల వైచెఁ గరముల్ గంపంబు నొందన్ రహిన్.

⁠ 290


చ.⁠

అసదృశశోకబాష్పమలినాంబకయై యొకకోమలాంగి త్య
క్తసరక యయ్యు శీఘ్రమునఁ దద్గుణమైన శరీరసాద మ
ట్ల సకలవాక్యవైభవము నచ్ఛకపోలము లందు దట్టమై
యెసఁగిన రక్తిమంబును వహించె విభుం డనికిం గడంగినన్.

⁠ 291


చ.⁠

అని యొనరింపఁగాఁ జనెద మంచు యువుల్ పలుకన్ దదంగనల్
ఘనతరశోకవార్సిహితకంఠనిరుద్ధసమగ్రభాష లై
చనుఁడను వాక్యముల్ పలుకఁజాలక సాంద్రశుగశ్రుపూర్ణలో
చనములచేత నుత్తర మొసంగిరి భావ్యశుభంబుఁ దెల్పుచున్.

⁠ 292


చ.⁠

కలనికిఁ బోవుచోఁ బతులు గాఢవిశాలమహీధరోల్లస
త్ఫలకసమానపక్షముల బంధురపీనపయోధరావృతో
జ్జ్వలవరవారవాణములు బ్రద్దలు వారఁగ నాత్మపత్నులన్
వలనుగఁ గౌఁగిటం గదియఁబట్టిరి కన్నుల నీరు నింపఁగన్.

⁠ 293


చ.⁠

విలసనశీలయైన యొకపీనపయోధర శోక మాత్మలోఁ
గలిగియు యానవేళ నిజకాంతజయైషిణి గానఁ గన్నులన్

⁠