Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ణానంతరంబ చైద్యపక్షరాజకుమారులందఱు యుధిష్ఠిరదేవ
యజనంబుననుండి యప్రతిహతమనోరథుండై చనుచున్న
దమఘోషజుని వేనుకొని యశ్వమేధీయాశ్వంబు వెనుకొని చను
తద్రక్షకరాజపుత్రులుం బోలె నతిరయంబునం జనిరి.

279


క.

జవనాశ్వంబులచేఁ జై
ద్యవిభుఁడు రథ్యాంతరముల నటు దాఁటి చనన్
దవిలి కనుంగొన వచ్చిన
యువతులకోరికలు సఫల మొందక యుండెన్.

280


గీ.

జనసమూహంబు గుమిగూడి సరణియందుఁ
గలసి గుసగుసలాడుచుఁ గాంచుచుండఁ
జేదిపతి వేగ శిబిరంబుఁ జేరఁబోయి
బలము సన్నద్ధముగఁ జేసె బవరమునకు.

281


గీ.

అపుడు శాంఖికసస్యదాస్యానిలప్ర
పూరితంబయి గిరితటమూర్ఛితప్ర
తిస్వనంబయి తద్యోథతీవ్రశంఖ
నిస్వనం బది విననయ్యె నిబిడ మగుచు.

282


వ.

మఱియుఁ గల్పాంతకాలపావనప్రేరితసంవర్తకాదిమహాజల
ధరదారుణనినాదంబును గంభీరనిజరవాంతర్గతగురుప్రతి
శబ్దాంతరం బగు చైద్యుని సాంగ్రామికదుందుభిధ్వని సెలంగె
దుందుభితాడనానంతరంబున సంభ్రమవిలోలసకలజన
సమూహసమాకులం బైన పరితశ్చంచలజ్యోతిశ్చక్రం బైన
సభస్స్థలంబునకు సాదృశ్యంబు నొందె.

283


గీ.

దృఢతనుత్రాణధారులై తేజరిల్లు
నృపవరులు ధూమపటలపరీత మగుట
నతిభయంకరమైన మహాద్రిసామ్య
మొంది చూపట్టి రపుడు రణోత్సవమున.

284


గీ.

మఱియొక నృపుండు పరిమూఢపరిజనంబు
చేత నాలస్యముగ సమానీత మైన
వర్మము విలంబరోషంబు వలనఁ గరయు
గమున నప్పుడు చూర్ణంబుగా నొనర్చె.

285


గీ.

సమరలాభజనితసంభ్రమసైన్యకో
లోహలాకులితమహాహవోరు
హస్తియందు యంత లతిప్రయాసముగఁ బ
ల్యాణ మెత్తి పెట్టి రతిభరమున.

286