Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యత్యుచ్ఛాట్టహాసంబు వజ్రాహతశైలతటధ్వనిభంగిఁ గ్రుద్ధుం
డైనవానిఁగా సూచింపంజేసె నతిరౌద్రంబైన క్రోధం బాక
స్మికంబుగా రయంబునం జనుదెంచి రాజమండలం బాశ్రయించె
మఱియు రుక్మి యనువాని హృదయంబునందు రుక్మిణీహరణ
కాలంబునం జనియించిన సంతాపవహ్ని భీష్మవాక్యశ్రవణంబున
నభివృద్ధి నొంది యధికంబుగాఁ బ్రజ్వలించె సుబలుం డనురాజు
శిథిలీకృపమహామహీధరబంధనయుఁ దీరంబునందు భూకంపంబు
వలనఁ జలితజలరాశిసలిలయు నత్యంతభారంబువలన నమ్రీ
కృతఫణీఫణామండలయు నైనభూమిని గోపావేశంబుగఁ జరణ
తాడనఁంబుఁ గావించెఁ జక్రపాణిపూజనంబుచేత రాజులు కుపితు
లగుచుండ నాహుకి యనురాజు యుద్ధలాభంబు గలిగెఁగదా
యని మనంబున మిక్కిలిసంతోషంబు నొందెఁ గాలయవనుని
వదనంబు జగంబు మ్రింగ నప్పళించినట్లు వివృతంబగుటవలన నతి
వికృతంబై యతికోపంబునఁ బ్రతిబద్ధవచనంబై యతిరౌద్రంబై
యొప్పె సమస్తరాజుల వధించుటకుఁ బ్రసారితంబైన
దీర్ఘబాహువు పరిఘంబుచేత సత్వరంబుగాఁ బదచలనంబు
గావించు వసునామ రాజుచేత నుత్థానవేగంబువలన దుర్నిమిత్త
సూచకంబుగా స్వకీయాంబరంబు స్ఖలితంబయ్యె.

269


సీ.

అప్పు డిప్పగిది ఘోరాకారరాజమం
                        డలము కందర్పసైన్యంబుపగిది
నవికృతచిత్తుఁడౌ హరి బోధిసత్వుని
                        యగ్రభాగంబున నతిభయంక
రత్వంబుఁ బ్రాపించె రమణ ననభ్యస్త
                        సాధ్వసు లగుటచే సంగరార్థు
లైన సభాస్థితమానవనాథులు
                        శిశుపాలునకుఁ బ్రీతి సేయఁబూని


గీ.

కనకమయచారుకోటీరఘటితరమ్య
సాంద్రమణిరత్నకిరణసంచలితభిత్తి
కలితనూతనస్ఫటికోరుకాంతు లగుచు
నొండొరులఁ బిల్చికొని లేచి రుగ్రు లగుచు.

270