Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చనుఁబా లిచ్చిన భామిని
జననీసమ యండ్రు బుధులు స్తన్యము గొని పూ
తనఁ జంపె నిర్దయుండై
యనయము శ్రీమాతృహంత యగు నితఁ డుర్విన్.

259


వ.

మఱియుఁ జపలుండగు కృష్ణుండు శకటమర్దనంబును యమ
ళార్జునభంజనంబును గోవర్ధనధారణంబును వాత్యాసురవిదా
రణంబు మొదలగు నేయేకర్మంబులఁ జేసె నాయాకర్మంబుల
చేత ధీరచిత్తు లగువారికి విస్మయం బేల కలుగకయుండు నది
యునుంగాక యుగ్రసేనతనయుండైన కంసునిపసులం గాచుచు
నసుకరం బైన స్వామివధం బాపాదించె నది పరమాద్భుతం
బితండు నరపశు వగుటకు సందియం బేమని యిట్లు క్షాంతవైరి
బలభరుండు నసహిష్ణుండు నగుశిశుపాలుండు నిష్ఠురం బగు
నట్లుగా దుర్వాక్యంబులు బలికి యప్పుడు నరకపుత్రునితోఁ
గూడ దత్తంబైన పరస్పరకరతాడనంబు గలుగునట్లు
తారంబుగాఁ గృష్ణదోషోద్ఘాటనసమ్మోదంబున నట్టహాసంబు
గావించె.

260


సీ.

పరుషంబులగు శిశుపాలునిమాటలు
                        విని వాసుదేవుండు తనప్రతిజ్ఞ
కెటు హాని గల్గునో యను భయంబునఁ గుపి
                        తుఁడు గాఁడు సత్యసంధుని మనంబు
చలియింపఁజేయ నేజనులకు శక్యంబు?
                        యాదవవీరు లత్యాగ్రహంబు
గలిగియు విభుచిత్తగతి విచారించి చై
                        ద్యుని మీఁదఁ గవయక యూరకుండి


గీ.

రపుఁడు; శౌరి యలంఘ్యాత్మ లపితపాశ
బద్ధుఁడై వాని తొల్లింటి పాపవాక్య
శతము నటు ద్రోచిపుచ్చి తత్సమయనింద
నోక్తులన్నియు లెక్కింపుచుండె నపుడు.

261


క.

కృపణుఁడగు చైద్యు తొల్లిటి
యపరాధములను దలంపఁడయ్యె రమేశుం;
డుపకారములనె తలపుడు
రపకారములను దలంప రార్యులు ధాత్రిన్.

262


క.

మందాకినితనయుండు స్వ
నిందన మెన్నక రమేశునిందనమునకున్