Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దలరు చలన్మహీరుహదళాంతరగోచరశీతధామరో
చులక్రియ నప్డు చూపఱులచూడ్కులకుం గడువిం దొనర్చుచున్.

86


చ.

మఱియుఁ బ్రఫుల్లనూతనతమాలసుమోపమకాంతిరాజిచే
బరువడి సప్తవర్ణసుమపాండుమరీచులచేఁ బరస్పర
చ్ఛురితవినిర్మలద్యుతుల సొంపు వహించిరి యేకవర్ణులై
హరియు మునీంద్రుఁ డర్కతనయాన్వితగాంగజలంబుకైవడిన్.

87


మ.

లయకాలప్రతిసంహృతాత్ముఁ డగునేలక్ష్మీశుసత్కుక్షిలో
రయ మారన్ సవికాసతన్ భువనముల్ రాజిల్లు నక్కుక్షిలో
నియతిం దాపసరాట్సమాగమభవోన్నిద్రోరుసంతోషసం
చయముల్ మిక్కిలి దుర్వహంబు లగుచున్ సాగెన్ మహాభారమై.

88


చ.

దినకరునిం బలెన్ నిశితదీధితి యైన తపస్వివర్యునిం
గనుఁగొని సమ్మదంబున వికాసము నొందుటఁ జేసి ప్రాప్తనూ
తనరుచి గల్గునేత్రములు దాల్చిన కృష్ణుఁడు పుండరీకలో
చనుఁ డనుప్రస్ఫుటాహ్వయము సత్యముగా నొనరించె నత్తఱిన్.

89


వ.

అప్పుడు.

90


ఉ.

ఆ వసుదేవపుత్రుఁడు, మహాగుణశాలి, విసారిశుభ్రదం
తావళిదంభశీతకిరణాంశులచేత స్వభావశుభ్రసు
శ్రీవృతగాత్రమున్ సితిమచే ఘనసౌధము నట్ల చాల సం
భావన సేయుచున్ స్మితసమంచితవాక్యముచేత నిట్లనున్.

91


చ.

అనఘ! శరీరధారులకు నద్భుతవైఖరి నీదు దర్శనం
బనిశము మూఁడుకాలములయందును బాత్రత నొందియుండు నె
ట్లనిన నఘం బడంచు నిపు డాయతియందును భద్రహేతువౌ
నమపమపూర్వపుణ్యవిభవాధికతన్ గృతమయ్యెఁ గావునన్.

92


మ.

అపరిచ్ఛిన్నసహస్రరశ్మియగు నయ్యంభోజమిత్రుండు వి
ష్టపమందే తమమున్ హరించుటకుఁ దా శక్తుండు గాఁడయ్యె, న
వ్విపులాజ్ఞానతమంబు మీ యగణితావిర్భూతతేజంబులన్
నిపుణత్వంబునఁ బోవు, దూరగతమై నిర్మూలమై, తాపసా!

93