మఱియు నమృతవిభాగకాలంబున శిరశ్ఛేదంబుచేత బద్ధవైరుం
డైన సైంహికేయుం డీహరి కపకృతి సేయ సమర్థుండుగాక యతి
రమ్యంబైన తదీయవదనంబుతో సాదృశ్యంబు నొందిన శశాంకు
నిప్పటికి బాధింపుచున్నాఁడు. అనపాయస్వరూపకుం డగుటం జేసి
యప్రతిహతస్మరణశక్తిగల యీకృష్ణుం దుపదేశపరంపరాపగ
మంబువలన నధ్యయనవిచ్ఛేదంబు నొందిన వేదంబులను గ్రమ్మరఁ
బ్రతివర్తింపం జేయుటకు నత్రిగోత్రంబునందు దత్తాత్రేయనామ
కుండై జనియించె మఱియు నితండు పరశురామావతారంబు
నొంది యర్జునకాంతారంబును వినాశితప్రచురపత్రసంపత్తి గలు
గునట్లుగా విలూనభూరిబాహుశాఖంబుగా సముజ్ఝితచ్ఛాయం
బుగా నొనరించె మఱియు నివ్వాసుదేవుండు రామనామంబున
దశరథునకుఁ బుత్రుండై జన్మించి విధ్వంసితదృప్తదశాననం బైన
లంకను దేజంబుచేత నధికవిభీషణంబుగా నొనరించె నిప్పు
డింద్రశత్రువులైన రాక్షసుల సంహరించుటకు విరించిచేతఁ
బ్రార్థితుండై వసుదేవవామఁకుండైన కశ్యపునకుఁ గృష్ణాభిధా
నంబున నవతరించె నిమ్మహాత్మునిచరిత్రంబులు లోకపవిత్రంబులు
భవలతాలవిత్రంబులై యుండు నిమ్మహానుభావుని ప్రభావంబు
గొంత యెఱింగించెద వినుము.