Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రతిమామోదముతో భుజించి యమరుల్ తద్దివ్యపీయూషమే
సతతంబున్ మదిఁ గోరుచుందు రతితృష్ణన్ రాజసూయంబునన్.

190


మ.

అరయం దత్క్రతువందు యాజకులచే నాహూతులై బల్విడిన్
బురుహూతాదికనిర్జరేంద్రు లనిశంబున్ వచ్చుచుండంగఁ ద
త్తరుణుల్ బ్రోషితనాథలౌట సురమందారస్రగాబద్దసుం
దరధమ్మిల్లలు గాక యుండిరి రహిన్ దద్యాగకాలంబునన్.

191


గీ.

అమ్మఖమునందు సురులు హవ్యంబు నర్థిఁ
బ్రాశనము జేసి దీర్ఘామరత్వ మొంది
రధికదుర్జయులైన పూర్వామరులను
సంగరమునందు వధియింప శక్తులైరి.

192


చ.

అలయక నమ్మహాక్రతువునందు నొకింత క్రియాపచారమున్
గలుగదు సర్వసాధననికాయసమృద్ధియుఁ గల్గియుండు సొం
పలరఁగ రాజసంపదలు యాజకవర్యుల బుద్ధిసంపదల్
మెలఁకువతోఁ బరస్పరము మించి చెలంగె సమగ్రవైఖరిన్.

193


ఉ.

దక్షుఁడు ధర్మపుత్రుఁడు వదాన్యశిరోమణి యధ్వరక్రియా
ధ్యతులఁ బంక్తిపావనుల యాజకులన్ మఖరక్షణార్హులన్
బక్షివరాశ్వునాజ్ఞఁ గొని పంక్తులు దీర్చి సమగ్రభక్తితో
దక్షిణ లిచ్చె శాస్త్రగదితం బగుభంగి యథాక్రమంబునన్.

194


గీ.

చెలఁగి సత్క్రియాలబ్ధసంసిద్ధులైన
యఖిలబ్రాహ్మణక్షేత్రంబులందు భావి
వివిధఫలదంబులగు ధనబీజములను
సలిలపూర్వకముగఁ జల్లె జనవిభుండు.

195


గీ.

నృపుఁడు వేదికయందు మహీసురులకు
దక్షిణ లొసంగి పూతుఁడై తనరు టది వి
చిత్రమా? దక్షిణలు గొనిఁ క్షితిదివిజులు
దళితపాపులై రది విచిత్రంబు గాక.

196


చ.

బలరిపుతుల్యశాసనుఁడు పార్థివశేఖరుఁ డప్పు డాత్మహ
స్తలిఖితనామలక్ష్మయుతశాసనపత్రములన్ లిఖించి సొం
పలరఁగ యాగకాలమున నావిధుభాస్కరతారకంబుగా