Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ఘటితదర్భవికారయోక్త్ర యగు ధర్మ
పత్నివీక్షితహవ్యంబు ప్రణయనాది
సత్కృతంబైన శిఖియందు శాస్త్రఫణితి
హోమ మొనరించి రపుడు కల్పోక్తభంగి

186


వ.

మఱియు నమ్మహాయజ్ఞకర్మంబునం దూహాకుశలులగు ప్రయో
క్తలు వేదంబునందుఁ బ్రథమాదిసకలసుబంతవిభక్తులచేతను
దిగంతవిభక్తులచేతను లింగంబులచేతను శీఘ్రనిగదితంబు గాని
కర్మాంతవేదవాక్యంబును బలుకుచు సందేహోత్పాదనంబు
కొఱకు సాదృశ్యంబు ధరించినవియుఁ బ్రకృతికర్మత్వంబు నుద్దే
శించి యత్యంతవిలక్షణఫలప్రదంబులు నగు సమాసంబులు
ప్రసక్తంబు లగుచుండ శబ్దశాస్త్రవిదులగు ఋత్విజులు తత్తత్స
మాసవిహితస్వరవశంబుచేత నీస్వరంబు నీసమాసంబు నీవిగ్రహం
బని యన్యతరపక్షావధారణంబు గావించిరి. ప్రకాశమానంబైన
లోలజ్వాలారసనాశతప్రభామండలంబుచేత హసింపుచున్నవాని
యట్లున్న పావకుండు వషట్కారంబుచేత వ్యక్తంబైన పరిశుద్ధ
ప్రభూతాజ్యంబు పెక్కుమాఱ్లు నాస్వాదించె.

187


సీ.

మఱియు నుత్సవనాదిమంత్రపూతహవిస్సు
                        భుజియించు శిఖి కతిస్ఫురితరూప
వృద్ధినొందినతనువేమహౌజిష్ఠత్వ
                        మొందిన యదిఁ గాదు యొప్పు మీఱఁ
బరగ సువ్యక్తార్థవర్ణసంపదఁ దాల్చి
                        యవనిలోన హవిర్భుగాఖ్య గలిగె;
స్వాభావికోష్ణసంస్పర్శంబు దాల్చిన
                        యనలుఁ డాజ్యాదికంబును దహించె


గీ.

ననుట చిత్రంబుగాదు హవ్యప్రభూత
సౌరభంబు నాఘ్రాణించు సర్వజనుల
మూర్తివంతంబు గానట్టి పూర్వపాప
సంచయంబుల నెల్ల భస్మంబు సేయు.

188


చ.

అనలునికేతనంబు రయ మారఁగ నప్పు డధఃకృతాభ్రమై
యనువుగ ధూమ్రపఙ్క్తి నిఖిలాశలు గప్పఁగ సాంద్రభంగి న
జ్జనపతి యజ్ఞవైభవము సన్నుతి సేయుచు భాగముల్ గొనన్
మునుకొని వేల్పులం బిలువఁబోవు తెఱంగున బోయె మింటికిన్.

189


మ.

జితపాధోనిధి దేవదానవవరక్షిప్తోరు నా నౌషధీ
లతికానిస్రుతసారమౌ నమృత మాలస్యంబు గాకుండ న