Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

సదనరత్నభిత్తికలందు సంక్రమించి
నట్టి ప్రతిబింబములయందు నగ్రభాగ
మందు నెదురుగాఁ జనుదెంచు నతివ లపుడు
సుఖులకు ముదం బొసంగిరి సురుచిరముగ.

163


చ.

అరుదుగ నెందు నూత్నహరితాశ్మవినిర్మితవేశ్మపంక్తులన్
హరితతృణంబులంచు నమితాస్యములై రసనాగ్రలగ్నభా
సురకిరణాంకరంబు లగుచున్ గబళంబు గ్రసింపుచున్నవై
ఖరిఁ గనుపట్టు పెంచినమృగంబులఁ జూచె జనంబు సొంపుగన్.

164


గీ.

అరయ నెద్దానిచెంగట నాలవాల
భృతజలాదర్శబింబితపృథుతరాత్మ
తనువుచే సపలాశసంతతి సమూల
సంతతిని జూచినట్లుండె క్ష్మారుహములు.

165


గీ.

మఱియు నురగేంద్రమూర్ధజమణిసమీప
మందు ముహురున్నతాంభోధరారవముల
చేతఁ దత్ప్రాంగఁణోర్వు లుద్భూతవాల
వాయజమణిస్థలాంకురచ్ఛాయ నలరె.

166


చ.

అలవుగ నెందు గూఢసలిలాశయముం గని ధార్తరాష్ట్రుఁడున్
స్థలమను భ్రాంతిచేత డిగి తత్సలిలార్ద్రశరీరుఁడైన నిం
పలరఁగ వాయునందనుఁడు హాసముఁ చేసినఁ దద్రవంబునన్
గలగిరి రాజులెల్ల లయకాలము వచ్చె నటంచు భీతులై.

167


గీ.

మఱియు నెచట నిశితకరవాలకోమల
స్ఫురితశక్రనీలభూములందుఁ
దెలుపువారులేక జలమను భ్రాంతిచే
మొలపటంబు జనులు ముడిచికొనిరి.

168


చ.

అపు డమలాంశుపుంజరుచిరాంగులు నేత్రసుఖప్రదుల్ రమా
ధిపయమజుల్ రథంబుల నతిప్రియులై సభకున్ ముఖంబుగా
విపులరుచుల్ శశాంకుఁడు కవిప్రవరుం డుదయాద్రినుండి మీం
టిపయికి నుద్గమించుటకు డిగ్గినకైవడి డిగ్గిరింపుగన్.

169


వ.

ఇట్లు రథావతరణంబుఁ జేసి మాధవుండు ధర్మనందనుండు మార్గం బుఁ జూపుచు నగ్రభాగంబునం బోవుచుండఁ బ్రభాపటలవ్యాప్తిచేత నదృశ్యరత్నమయకుడ్యంబై బహురత్నప్రభాపుంజంబుచేత నవి