Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాన్వితయునైన యమ్మహానది ధరిత్రికాయతవేణియుంబోలెఁ
బ్రకాశించె; మఱియుఁ గొందఱుజనంబులు నావ్యంబైన జలంబున
ప్రతిహతశీఘ్రగమనంబులు ననుజ్ఝితదైర్ఘ్యంబులు నపాకృత
మహోన్నతగురుతరతరంగంబు లగుటం జేసి యపరతరంగంబులుం
బోలె నుపస్థితంబులైన బాహువులచేత నుత్తరించిరి మఱియుఁ
బ్రియవల్లభుం డగుకృష్ణుని వరూధినిమహోక్షశృంగాఘాత
విదళితమహాకూలయు మద్భూతమదవిషాణిగురుచరణాకృష్ట
జలగ్రాహయు బృహద్రథవ్యాకులితపుష్కరయునైన యమునా
నది నప్పు డుత్తరించి సుఖంబుగాఁ జనియెఁ దదనరతరంబ.

117


సీ.

కడువేడ్క ద్వారక విడిచిన దాదిగా
                        హరి నిజసైన్యసమన్వితముగ
నిచ్చోట విడిసె నేఁ డిచ్చోటు వెలువడె
                        నని దినదినవార్త లరయుచున్న
వాఁడు గావున మహీవరుఁడు ధర్మసుతుండు
                        కమలలోచనుఁ డట్లు యమున దాఁటి
వచ్చుచున్నాఁ డను భవ్యవార్తను విని
                        సంలబ్ధసాంద్రహర్షంబువలన


గీ.

వర్ధితశరీరుఁడై తనవారినెల్ల
నాక్షణమె పిల్వనంపించి యనిలనంద
నార్జునాదిసహోదరు లనుగమింప
నెదురుగా వచ్చె మంత్రులు హితులు గొలువ.

118


వ.

మఱియుఁ గృష్ణాగమసంతోషప్రవృత్తకౌరవసేనాతూర్య
ఘోషబధిరీకృతకర్ణేంద్రియం బైనశ్రోతృజనంబునకుఁ గథకుల
చేత స్పష్టాలాపములయందుఁ బ్రాక్రాంతాభిధేయశేషం బుపరత
వాద్యఘోషంబైన యనంతరంబ హస్తసంకేతంబుచేత సంపా
దితంబయ్యె శీఘ్రపరివర్తితకనకచక్రనేము లగుటం జేసి వేగవ
న్మారుతాకంపితపరస్పరోపమమహీరేణు తనవసనంబులైనరాజ
సంబంధిరథంబు లంతటఁ బాదమాత్రంబైన యవకాశంబు లేకుండ
నిండె.

119


చ.

హరిఖురఘట్టితావను లుదంచితపాణితలాభిఘాతభా
స్వరపణవాఖ్యవాద్యములభంగి ద్రుతంబుగ మ్రోసె వెంబడిన్
గర మురువారివాహపటుగర్జితవారణవాదహృష్టవి
స్ఫురితకలాపబర్హు లటుముంగల నృత్యముఁ జేసె నత్తఱిన్.

120