Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బడిన లఘుగతి భువిదాఁటి పటురయమునఁ
బఱచి శకటసమూహంబు విఱుఁగదన్నె.

75


గీ.

అరయ ప్రస్తాంగసంధిగతాక్షపాట
వంబగు రథంబు శకలీకృతంబు గాఁగఁ
దక్షవైద్యులచేతను తత్క్షణంబ
గఱపె లంఘనపూర్వకక్రమము దెలియ.

76


గీ.

స్థాణుసంసక్తశకటంబు సాంద్రభార
భంగసంక్షోభదారితభాండకలిత
మద్యవిప్లాితోన్నతమార్గ మగుచు
నుండ శోకించె సార్ధవాహుండు చూచి.

77


చ.

నిరుపమభేరికారవవినిందితభూరిగుహాముఖంబు భూ
ధరనిభదంతిరాజవిజితస్ఫురితోవలమున్ ధ్వజాంశుకో
త్కరపరివర్ణితోచ్చలితకందళికాన్వితమైన శైలమున్
గుఱుతుగ సైన్యముల్ వెనుకకుం బనిచెం గడుదూర మౌటచేన్.

78


చ.

ఘనవసదంతిరాజమదగంధవహాధిక దుర్ధరంబులై
యనుపమరోషభంజితమహాతరుశాఖములై మదోత్కటం
బునఁ జరియించు దుష్టగజపుంజములన్ గడునేర్పుతో నిషా
ది నిచయమధ్యముం దొలఁగదీసి వెసన్ నడిపించె నుద్ధతిన్.

79


సీ.

ఘనవైజయంతికావన రాజిరమ్యముల్
                        శైలప్రతిచ్ఛందసామజములు
సతతవిసర్పితజనతాతరంగిణీ
                        శతములు నగు చమూతతులచేత
బహుభూమితలములు ప్రచ్ఛాదితము లయ్యెఁ
                        జారుమృగీవిలోచననమాన
లలనావిలోకనంబులఁ జూచి కృష్ణసా
                        రంబులు ఘటికాద్వయంబు నచట


గీ.

వీఁకమృగినేత్ర శంకచేఁ బోక నిలిచి
యుండి పదపడి నానావిధోన్నతోరు
విభ్రమవికారములు నిరూపించి తెలిసి
సంభ్రమంబునఁ గడువడిఁ జనియె నపుడు.

80


గీ.

హరులు సాదులచే దృఢకరగృహీత
కశములయి మెల్లమెల్లనఁ గష్టతరము
గాఁగ నిమ్నభూములు డిగ్గి వేగ మడర
నుత్తరించె ఖురధ్వను లుప్పతిల్ల.

81