Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వనుచు నీక్షింపఁబడుచుండె నద్భుతముగ.

71


వ.

మఱియు సముక్షితఋజుకంధరంబులును జంచలకర్ణచామరంబు
లును సమాకులఘర్ఘరస్వరంబులునునైన యుష్ట్రంబులు విశాలం
బైన మార్గంబునుద్రుతచరణనిక్షేపంబు గలుగునట్లు తత్క్షణంబ
చూర్ణీకృతంబుగాఁ జేయుచుం జనియె మార్గంబునందు సారథిచేతఁ
ద్రాసార్థంబు కృతతారనాదంబు గలుగునట్లు శీఘ్రంబునఁ బ్రచోది
తంబై వేసరయుక్తంబైన శకటంబు నిజచక్రదారోత్థితసాంద్రమ
హీపరాగచయాక్రాంతభయంబువలన నతిరయంబున బోవు
చుండెఁ గంచుకి భయంబున నగ్రభాగంబునం బోవుచున్నవార
గుటవలనఁ బరావర్తితముఖు లైన సకలచమూచరపురుషులచేత
క్షణంబు సమీక్షితముఖసరోజలైన యంతఃపురకాంతలు తురం
గాధిరూఢలై తురంగవల్గనంబువలన నుల్లలితబృహత్తరకుచ
ప్రచలకూర్పాసకంబు గలుగునట్లు రయంబునఁ జనిరి.

72


మ.

అరయన్ ముందరఁ జక్రనేమి దళితంబై వెంబడిన్ భూరికుం
జరపాదాక్రమితోన్నతస్థలముపై సంచారభగ్నోన్నతాం
తరశూన్యం బగునట్లు పూరితమహోద్యన్నిమ్నభాగంబుపై
ధర యొప్పెన్ హలభృత్సమీకృతమహీస్థానంబు చందంబునన్.

73


చ.

చెలఁగి యశిక్షితం బగుటచే బయిక ట్లెగయంగ దానిపై
నిలువఁగలేక సాది యవనింబడఁ బల్యయనంబు జాఱి భా
రలఘుత నొంది చెచ్చెర నురంబున వ్రేలఁగఁ బాఱు గుఱ్ఱమున్
వలనుగఁ జూచి యచ్చటి జనం బిహిహీ యని నవ్వి రత్తఱిన్.

74


సీ.

సకలమహీభృదస్ఖలితోరుయమునాది
                        తటినుల స్వమహిమోత్కటముచేతఁ
గప్పుచు మూడుఁలమార్గంబు
                        జనుటచే గంగయు త్రిపదగాఖ్య
ప్రసిద్ధి గాంచె యనేకమార్గంబుల నేగెఁ
                        దద్వాహిని బహువిధధ్వనులు సెలఁగ
దంతావళోరుశూత్కారభీతములైన
                        కరభంబులు నియంత కడురయమున


గీ.

వ్యగ్రుఁడై చేతివర్గంబువదల మీఁద
నుండఁజాలక యవరోధయువతు లుర్విఁ