Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఘనరజ్జుసంకాశకరములఁ గుంభంబు
                        మాడ్కి సమాకృప్యమానుఁ డగుచుఁ
గృతచంచలవిహంగవితతశబ్దములైన
                        యాశలచే జలరాశి నడుమ
నుండి దివాకరుం దుత్తారితుండయ్యె
                        రమణీయముగఁ దోయరాశిలోన
నిశ యంతమగ్నుఁడై నిలిచియుండుటఁ జేసి
                        యౌర్వాగ్నికీలల నధికతప్తుఁ


గీ.

డయ్యెఁ గాఁబోలుఁ! గాకున్న నంబువులను
వెడలి చనుదెంచినప్పుడు వితతవహ్ని
కలితఖదిరకాష్టాంగారగౌరగాత్ర
మెత్తెఱంగున గలిగె? దినేశ్వరునకు.

40


గీ.

క్షణముపయినున్న రవి నవకరచయములఁ
బ్రాక్కుధర మొక్కటియె కాదు బంధుజీవ
కుసుమకృతశేఖరముఁ దాల్చి యెసఁగు టరయఁ
దరణిరుచిచేత నట్లయ్యె ధరము లెల్ల.

41


చ.

అలయక బాలసూర్యుఁ డుదయాద్రిశిఖాంగణమందు నాడుచున్
జెలువుగఁ జారుపద్మినులచే ససరోరుహవక్త్రహాసమున్
గలుగఁగ వీక్షితుం డగుచుఁ గమ్రఖగధ్వనిఁ జేరఁ బిల్చు న
ట్లలరు నభోంకమందు నిహితాగ్రకరుం డయి యొప్పె లీలతోన్.

42


చ.

పరువడి భానురా జుదయబర్వతపీఠమునం దొకింతసే
పరుదుగ నుండి భూతలమునం దటు పాదము లుంచి సజ్జనో
త్కరరచితప్రణామములు గైకొని వారి బహూకరించి చె
చ్చెర భువనంబుఁ జూచుటకుఁ జెల్వుగ నుత్థితుఁ డయ్యె నయ్యెడన్.

43


వ.

మఱియు నదులు బాలాతపచ్ఛురితంబు లగుటం జేసి పరిపక్వసురా
భంబై యుభయతీరనిరుద్ధంబైన సలిలంబును సూర్యకిరణసా
యకదళితఘనతిమిరదిశాగజఘటాశోణితంబునుంబోలె వహించి
ప్రకాశించె గవాక్షవివరంబుల గృహాభ్యంతరంబులు ప్రవేశించిన
తరుణతరుణికిరణంబులు ప్రాతఃకాలంబునఁ గాంతల పరిత్యజించి
యిండ్లకుం బోవదలంచిన పురుషులయందుఁ గుపితుండై మన్మ
థుండు ప్రయోగించిన వహ్నిసంతప్తనారాచంబులుం బోలె వె
లుంగుచుండె. మఱియు రాత్రియందు యువతులచేతఁ బీతమై