Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ళత్రుఁడగు శశి దుఃఖించి భ్రష్టశోభుఁ
డై కృశత నొందెనో యన నపుడు దోఁచె.

23


గీ.

ఎంతలో రవి గనుపట్టఁ డంతలోన
నరుణుఁడు తమంబునంతయు నవహరించె;
మునుకొని ప్రతాపవంతుల మ్రోలనున్న
యతఁడును రిపుప్రహర్తయై యలరుఁగాదె?

24


గీ.

విరహఖిన్నమౌ కోకంబు విగతతిమిర
మగు నిభముఁ జూచి పక్షంబు లటు విదిర్చు
నంతలోఁ దత్ప్రియాంగనయైన కోక
రమణి చనుదెంచెఁ దటిని తీరముున నుండి.

25


వ.

మఱియు రాత్రికాలంబున యువతులును బుష్పమాల్యంబులును
సంతుష్టయువమనస్కలై యువభోగంబుకొఱకు సంపాదితంబు
లైన వలయవసనాదిభూపణంబులచేత భూషితంబులై యుభ
యంబు తుల్యకాంతిని వహించియుండియుఁ బ్రభాతకాలం బగుట
యు యువతులు వల్లభాలింగనంబులచే విమృదితంబులై నిష్ప్రభ
త్వంబు నొందిన మాల్యంబులం బరిత్యజించి రప్పుడు.

26


సీ.

ప్రతివనమందుఁ జలితకమలౌఘుండు
                        విక్షిప్తవల్లికావిస్తరుండు
కంపితాశేషవృక్షప్రసూనుండునై
                        యెచ్చోట నిలువంగ నింపులేక
శ్వసనుండు కామినీప్రసవసంఘర్షణో
                        ద్గంధినిశాంతభాగముల నిలిచె;
నఖచిహ్నవళులందు నాభిసంధులయందు
                        దంతక్షతముల నొక్కింతసేపు


ఆ.

విద్యమాన మగుట సద్యఃప్రదృశ్యమై
భోగినీవరాంగరాగ మప్పు
డతిరహఃకృతంబులైనను సురుచిర
సురతవిలసితముల నెఱుఁగఁ జెప్పె.

27


చ.

మఱియుఁ బ్రభాతకాలపరిమిందవిభాయుతుఁడౌట దృష్టివి
స్ఫురితకళంకుఁడైన యలసోముఁడు ప్రోషితపత్రపఙ్క్తులై
పరిగతభోగలక్ష్ములయి పక్వశరోత్కణికార్జునంబులై
వఱలు సతీకపోలముల భర్త్సితుఁడైన క్రియం జెలంగెడిన్.

28


వ.

అంత ఖండితనాయిక యపరాధియై ప్రాతఃకాలసమాగతుండైన
ప్రియుని నిందింపుచు నిట్లనియె.

29