Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ల్లన నవమాలతీసుమపరాగకరీషరజంబుచేఁ బ్రభం
జనుఁ డొగిఁ గుళ్లగించి పెలుచన్ జ్వలియింపఁగఁజేసె నత్తఱిన్.

17


చ.

ప్రకటితపద్మబాంధవవిభాపరిహీణనిజౌజమైన దీ
పకళిక రాగవంతులగువారి రతిక్రమమెల్ల నర్థిఁ ద
క్కక యటు సర్వరాత్రమును గన్నులు మూయక చూచినందునన్
నికట సనిద్రమైన గృహనేత్రముకైవడి నుండె నత్తఱిన్.

18


సీ.

మఱియు మోదానంగమాద్యత్సుయౌవనో
                        న్నతకామినీమనోనాథసురత
సంరంభసంభవశ్రమజాతఘర్మని
                        వారణచణుఁడు ప్రభాతకాల
పవనుఁడు వికసితపద్మగంధములచే
                        భృంగపాళికల మోహింపఁజేసి
మంజులసురభితమకరందములు వెద
                        జల్లుచు వీచెను సంభ్రమమునఁ


గీ.

గోరి యీరాత్రి శశికాంతుఁ గూడి యుండి
శ్వసనసురభియై యిప్పు డిం పెసఁగఁ దత్క
రాంగరాగవిమిశ్రాంబరాంతమును వ
హించి రయమునఁ జనుచున్న దేపుమీఱ.

19


చ.

విలుళితనేత్రతారకలు విశ్రుతసుప్తినితాంతమేచకో
త్పలనయనల్ వికాసరహితస్ఫురదాస్యసుధాంశుబింబలున్
జలితశిరోజపాశలయి చయ్యన వారవధూమయిల్ నిశల్
వెలయఁగ రాజవేశ్మముల వెల్వడి రప్పుడు సంభ్రమంబునన్.

20


చ.

అతిరుచియైన చంద్రుఁడు నవాసితకంజవనీరమాసము
న్నతపరిహాసవైఖరులఁ దప్పక రాతిరి యెల్లఁ బుచ్చి యం
చితముగ స్రస్తహస్తుఁడయి చెచ్చెర నిద్దురపోదలంచి ర
మ్యతరసితాంగమస్తకు ధరాంకమునం దగఁ జేర్చె నత్తఱిన్.

21


గీ.

రాత్రివేళ సత్వరపరిరంభసంభ్ర
మంబున నపాస్తమైన రామాపటంబు
తత్పృథునితంబలోలనేత్రయుతుఁడైన
పతి యొసఁగఁడయ్యె గ్రమ్మఱ బత్ని కపుడు.

22


గీ.

"అకట! నిశ వోయెఁ గుముదిని ముకుళితాక్షి
యయ్యెఁ దారక ల్నశియించె" ననుచుఁ బ్రియక