Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

నలువొప్పన్ హయరాజి మున్ గళితకర్ణగ్రీవముల్ గల్గున
ట్లెలమిం గన్నులు మూసి జానుయుగళం బింపొందఁ బై కెత్తి సొం
పలరన్ గొంచెము గూర్కి లేచి చపలోష్ఠాగ్రంబునై వేడ్క ముం
గలిఘాసంబు గ్రసించె బ్రస్ఫురదుదగ్రప్రోథముం గల్గఁగన్.

12


మ.

"మును మత్సంగతిచేఁ బ్రవృద్దరుచియై పొల్పొంది చంద్రుండు పె
ల్చనఁ బ్రాప్తోదయుఁ డయ్యె నేఁ డపరతో సంబంధముం జేసినం
దునఁ బాతిత్యము నొందె నిట్లగుట నెందుం జూడ నర్హంబు గా”
దనుచున్ బ్రాచి హసించెనో యనగఁ దూర్పచ్ఛత్వ మొందె న్రహిన్.

13


మ.

సరసన్ భర్తలు సుప్తులైన వెనుకన్ సంసుప్తలై వారు గ్ర
మ్మర మేల్కాంచకమున్నె మేల్కొనియు భామారత్నముల్ భీతి న
త్తఱి నస్పందశరీరలై సురతఖేదప్రాప్తనిద్రాసుఖో
త్కరులౌ కాంతులఁ గౌఁగిట న్విడరు నిద్రాభంగ మంచు న్రహిన్.

14


వ.

మఱియు నప్పుడు శశాంకుండు సంధ్యాసమయరాగంబుచేత
లోహితావయవంబులై పరిపక్వరాజీవకందచ్ఛేదశుభ్రంబులైన
నిజమయూఖంబులచేతఁ గుంకుమంబుచేత నీషద్భగ్ననిజధావ
ళ్యంబులైన సరసచందనరేణువులచేతఁబోలెఁ బశ్చిమాశ నలంక
రించె; మఱియును.

15


సీ.

రమణీయకుముదషండము ముకుళీకృత
                        పత్ర మై క్షీణశోభను వహించెఁ
గమలషండంబు వికాసితదిళమయి
                        పరివర్ధమానశోభను ధరించె
నవ్యక్తమధురమౌనట్లు తుమ్మెదలచే
                        నుపగీత మైన యయ్యుభయ మపుడు
ననురూపదశ నొందె; నష్టారికిరణ సం
                        దోహం బనూరుచేఁ దుల్యరుచిని


గీ.

బరఁగఁ బ్రాపించి రయమునఁ జిరపరిచిత
వ్రీడ నటు వుచ్చినట్లున్న వృత్రవైరి
దిక్సతీవక్త్రమునకు నుద్దీపితావ
కుంఠనపటంబు క్రియఁ గప్పెఁ గోర్కు లలర.

16


చ.

అనిశరతిప్రయాసజనితాతిపరిశ్రమనిస్సహాంగనా
తనువున కాంతి నొందిన తతస్మరపావకునట్లు వెండి మె