Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బొలుపుగఁ బుచ్చి తా నిదురపోవ ననంతరయామపాలకుం
బిలుచుచు లెమ్ము లె మ్మనుచుఁ బేర్కొన, వాఁ డతినిద్రచే రహిన్
బలుమఱు నర్ధవాక్యములు పల్కుచు మేల్కొనకుండె నత్తఱిన్.

5


చ.

లలన బృహన్నితంబవిపులత్వనిరుద్ధమనోజ్ఞశయ్యపై
“నలువుగఁ బవ్వళించుటకు న ట్లవకాశము లేకయున్న నే
యలవున నిద్రఁబోనడఁతు?" నం చటు సారెకు మన్మథక్రియా
కలన నతిప్రయాసముగఁ గాంతుఁడు పుచ్చెను రాత్రిశేషమున్.

6


చ.

క్షణశయితప్రబుద్ధులు రసాపతులున్ గవిశేఖరుల్ పర
క్షణదలయందు మేల్కొని వికాసితసంతతధీప్రచారులై
ప్రణుతికి నెక్కు వార్ధిసమరాజ్యసుకార్యములందున్ బ్రతి
క్షణము ప్రయోగకల్పనలు సాధుగతిన్ దలపోసి రెంతయున్.

7


ఉ.

ఉర్వితలంబునందు శయనోత్థిత మౌట మదాంబుపంకిలా
ఖర్వశరీరమైన యొకగంధగజంబును యంత నేర్పుతో
గర్వ మడంచుచున్ వెనుకకాళ్లఁ దగిల్చిన శృంఖలధ్వనుల్
పర్వఁగ నొండుప్రక్కనవలన్ శయనింపఁగఁ జేసె నెంతయున్.

8


చ.

అతిలఘుహస్తగోపులు సమాహితమంథకదండమై సము
ద్ధతబహునాదయుక్తమయి తద్దయు నొప్పు దధిప్రకాండమం
దతులజలంబునందు సుర లబ్జునిఁబోలెను వెన్నఁ దీయఁగాఁ
జతురత వార్నిధింబలెఁ బ్రసన్నతఁ ద్రచ్చిరి కుంభి నుద్ధతిన్.

9


గీ.

మగనిప్రార్థన వినక తామొగము ద్రిప్పి
కూర్కినట్లుండి యటు కోడికూతను విని
లేచి నిద్రచే ముకుళితలోచన యయి
కనని యట్లుగ బిగియారఁ గౌఁగిలించె.

10


చ.

అనుగతవేణుపల్లకిరవైకత నొంది సమగ్రతాలమై
యనుపమబోధసాధనమునై కలమై యవిగర్హితంబునై
ఘనముగ నొప్పు గీతమును గాయకులుం దగఁ బాడుచుండఁగాఁ
బనిఁ బడి యాలకింపుచు నృపాలకులు న్నిదురించి రింపుగన్.

11