Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిశుపాలవధమహాకావ్యము

తృతీయాశ్వాసము

క.

శ్రీపద్మనాయకాన్వయ
దీపక! ఫణిరాజతుల్యదృఢతరభుజసం
స్థాపితధరణీభార! ర
మాపతిచరణాంబురుహసమర్పితహృదయా!

1


వ.

అవధరింపు మవ్వలికథ యెట్లనిన.

2


సీ.

చతురత నవికృతశ్రావకసుస్నిగ్ధ
                        కంతులై యొప్పు మాగధులు వచ్చి
సమధికశ్రుతులైన షడ్జస్వరంబును
                        బంచమస్వరము ప్రభాతకాల
మందు నిషిద్ధంబు లౌటచే వర్ణించి
                        తతవేణువీణామృదంగతాళ
కలితంబుగఁ బ్రభాతకాల ముచ్చైస్స్వర
                        ఘనరాగమున మాధవునకుఁ దెల్పి


గీ.

రతనురతితాంతనయనద్వయంబు మూసి
మూయకయమున్నె గురుతరమురజరవము
కల్యసమయంబు దెలుపుచు గాంత భావి
విరహసూచకమగునట్లు వేగ మ్రోసె.

3


మ.

భవదీయోజ్జ్వలశైశవంబునఁ బదప్రక్షిప్తమై పోయి వే
గ వియన్మార్గమునన్ భ్రమించు శకటక్రవ్యాదుచందంబునన్
దివిపై నల్పశరీరుఁడైన ధ్రువుపై దేవర్షిరాణ్మండలం
బు వికాసస్థితిఁ దక్కి యొప్పెడు నిశాభోగాంతముం దెల్పుచున్.

4


చ.

మెలపున యామపాలకుఁడు మేల్కొనియుండి స్వపాల్యయామమున్