Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

నెలఁతలదేహమందు శయనించిన యవ్విషమేషుఁ డత్తఱిన్
జలమున బాహుపీడనకచగ్రహణంబులచేత సంతతో
జ్వలనఖదంతపీడలను జయ్యన మేల్కని జాడ్యహీనుఁడై
యెలమి రమింపఁజేసెఁ దగ నిర్వుర నాత్మనిచేష్టితంబులన్.

318


వ.

మఱియు నొక్కకాముకుండు వస్త్రాపకర్షణక్షణంబునఁ గామిని
చేత సమాశ్లిష్టుండై వ్యగ్రకరుం డగుచు దుకూలంబు నాకర్షింపం
గడంగి నిరంతరస్తనతిరోహితనేత్రుం డగుటంజేసి యంతకుమున్నె
విగళితంబైన వస్త్రంబు నెఱుంగం డయ్యె నప్పుడు.

319


ఆ.

"తరుణికుచముచేతఁ దాడితనైతి నిం
కిచట నాకు నుండ నేటి?" కనుచుఁ
ద్రుటితహారయష్టి ప్రియునెద మౌక్తిక
వృష్టిఁ గురిసె బుష్పవృష్టికరణి.

320


గీ.

స్నిగ్ధవాక్యంబు దీనోక్తి సీత్కృతంబు
మణితము నిషేధవచనంబు మఱియు భూష
ణారవంబులు వాత్స్యాయనాదిరచిత
మైన స్మరశాస్త్రపద్యార్థ మధిగమించె.

321


గీ.

నిభృతమేకంబు విచ్ఛేదనిరత మైన
సతులమణితం బవిచ్ఛేదచారుమధుర
బహుళతరకాంచినూపురధ్వనులచేత
నక్షతముగాక విననయ్యె నద్భుతముగ.

322


వ.

అప్పుడు రతిసంభ్రమంబువలన ధరణీతలంబునఁ బాతితంబైన కాం
చీదామం బీదృశంబైన నీజఘనంబున కుపరిసురతంబులందు ము
హుర్ముహురుత్సతనపాటనం బెట్లు గలిగె నని విస్మితంబైన జఘనమ
హత్వంబు దర్శింపంజేయుచున్నదానిఁబోలె నొప్పె మఱియును.

323


సీ.

విగతచిత్రకచిత్రవిపులకపోలంబులం
                        దార్ద్రనఖపదవ్యాపనములె
చిత్రరూపము లయ్యెఁ జెలఁగి విచ్యుతకుసు
                        మాలకాగ్రములందు నంచితముగ
శ్రమవారికణములె సుమవితానము లయ్యె
                        మఱియుఁ గామినులు రమణులకొఱకుఁ
గ్రమత నేయేచేష్టితము ప్రియంబై యుండు
                        నింపుగా నదియుఁ గావించి రప్పు