Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

అచ్చుపడంగ మన్మథశరాగతశాపము యౌవనోష్మమున్
హెచ్చుగ వల్లభుండు దను నెంచకఁ జేసిననేర మిట్టి ము
చ్చిచ్చునఁ జాలఁ దప్త మయి చెన్ను వహించినఁ దత్కుచోరుభా
రోచ్చయ మీషదుష్ణ మిడ దొప్పుగఁ గౌఁగిటఁ జేర్చువేళలన్.

255


చ.

స్మరగురుయౌవనోష్మముల సాంద్రతరోష్ణత నొందియున్న సుం
దరకుచకుంభయుగ్మముమ దాల్చి మనోజ్ఞముఖంబుచేత నీ
స్థిర విహరించు వేడ్కఁ జనుదెంచిన యుర్వశి పోలె నొప్పె నా
సరసిజపత్రలోచనకు సాటియె మేనక రూపసంపదన్.

256


వ.

ఇత్తెఱంగుననప్పు డుపశమితకోపాంతరాయంబులైన శశాంక
కిరణంబులు కామినీకాముకులకు దూతికలకరణి నన్యోన్యసం
ఘటనంబు గావించుటకు సమర్థంబు లయ్యె; విలసిన్మణితసీత్కా
రాదిమదనాతిరేకవికారంబులైన మద్యంబులు లజ్జాప్రత్యూహ
నివారణకుశలంబులై యన్నెలంతలకు సురతకార్యంబులం చా
చార్యత్వంబు వహించెఁ బానగోష్ఠీప్రస్తావానంతరంబున ధావన
క్షాళనాది సంస్కృతంబులును స్వభావసంస్కారసౌరభ్యయుక్తం
బులును సముల్లసన్నయనవారిరుహంబులును నవయవసుయోజి
తంబులు నగు కామినీవదనంబులు యౌవనపురుషులకు సురాపాన
భాజనత్వంబు ప్రాపించె నప్పుడు.

257


చ.

సతతము సోపచార ముపశాంతవిచారము చిత్తకాంక్షణీ
యతమము సానుతర్ష మగున ట్లనుతర్షపదంబునన్ సము
న్నతగతి నున్న నత్తనువు దాల్చిన ప్రేమను బ్రాణనాథు ల
ప్రతిమసుధారసంబు బలెఁ బాన మొనర్పగఁ జేసి రింతులన్.

258


సీ.

అనుపమాక్రాంతకాంతాననప్రతిబింబ
                        మగుటచేఁ గన్నుల కతిసుఖంబు
లలితరసాలపల్లవగంధి యగుటచే
                        ననిశంబు నాసిక కధికసుఖము
సౌరభాగతసముజ్జ్వలభృంగరవముచే
                        శ్రవణంబులకును నిర్భరసుఖంబు
గురుతరమాధుర్యగుణయుక్త మగుటచే
                        రసనకు మిక్కిలి రమ్యముఖము