Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రకాశింపంజేయుచుండ నప్పుడు నిజకార్ముకం బాకర్షించె.

219


చ.

ప్రసవధనుర్ధనుశ్చలితరమ్యశిలీముఖజాలముల్ శశాం
కసురుచిమండలోదయవికాసము నొందుచునుండఁగా సము
ల్లసితనవాసితోత్పలకలాపములందును బంకజాక్షిమా
నసములయందు నొక్కతఱి నల్వుగఁ జేరె రొద ల్సెలంగఁగన్.

220


గీ.

దిఙ్ముఖంబుల కత్యంతతేజ మొసఁగి
సరసరతి కాకులత్వ మొసంగి యత్రి
వీక్షణోద్భవాసరవహ్నివిధుఁడు కామ
దేవున కొసంగె నధికప్రదీపనంబు.

221


వ.

ఇట్లు చంద్రుం డుదయించి సాంద్రచంద్రికాజాలదవళికృతదిశా
ముఖుండై వెలుంగుచుండ నక్కాలంబునందుఁ గృతంబైన సమ
స్తకార్యం బుపకారంబు గావున నప్పు డంగనలు ప్రియతమా
గమనంబు నిశ్చయించి నైపథ్యంబు గావింపందొడంగి రెట్లనిన.

222


క.

తరుణీకుచతటములు గురు
తరైకహారమును సమవిధంబుగఁ దాల్చెన్
ధర సంహతత్వజనిరం
తరాళత భజింప నవ్విధంబె ఘటించున్.

223


గీ.

తరుణి కదళీప్రకాండోరుతరువు మొదలఁ
జారుజఘనస్థలీపరిసరమునందు
సాంద్రతరమేఖలోరుపాశంబుచేతఁ
గంతుదంతావళంబును గట్టివైచె.

224


గీ.

సతులకెమ్మోవులందు లాక్షాద్రవంబు
తతకపోలములందు లోధ్రకరజంబు
కనులఁగాటుక విశదశంఖమున నిడిన
పాలకరణి నభిన్నమై చాల నొప్పె.

225


సీ.

చలదుజ్జ్వలాధరదళయుతంబులు విక
                        సద్దశనాంశుకేసరభరములు
ప్రకటితగండఫలకములైన ముఖాంబు
                        జములచే నొప్పిరి రమణు లప్పు
డధికునిచే జితుండైనవాఁడు విదేశ
                        గతుఁడయి చనునట్లు గాక కుశలుఁ
డై యుండెనేని నయ్యధికునిఁ దగ నాశ్ర
                        యించి తత్కృపను జీవించునట్లు
ప్రతిమాచ్ఛలమున నిర్మలకపోలములైన
                        యింతులముఖ మాశ్రయించె విధుఁడు