Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

బలసి చుట్టు ఋక్షపటలి గొలువ
జలధి నుత్తరించి శశిరామభద్రుండు
ప్రబలతిమిరదనుజరాశిఁ దునిమె.

⁠ 213


ఆ.⁠

శశిపణిగ్విరుండు సతతంబు ముగ్ధత
నలమి గగనవిపణియందుఁ జేరి
యుడుగణేంద్రుకళల నుపచయమొందించు
కుతుకమును భజించెఁ జతురుఁ డగుచు.

⁠ 214


గీ.⁠

రాత్రి కువలయనాథు నలంకరించె
రాతిరి నలంకరించెఁ గళావిభుండు
ఘనులచరిత మన్యోన్యోపకారవంత
మగుచు నవిలంబితక్రమమై తనర్చు.

⁠ 215


గీ.⁠

అర్కపాదాభినిహత యై యళిరుతములఁ
బవలు రోదన మొనరించు పగిదినున్న
కుముదినీసతి శశికరాగ్రములచేత
నపుడపుడు సంస్పృశింపుచు నాశ్వసించె.

⁠ 216


గీ.⁠

విభునిమ్రోల సతులు విధురశ్మిగళదంబు
కణహిమాంశుమణివికారప్రతిమ
నతనుఘర్మసిక్త యగుసపత్ని యటంచు
భ్రాంతి నొంది కనిరి భయము గదుర.

⁠ 217


సీ.⁠

అరయ నోషధిపతి యమృతరసద్రవ
                        కరముల నంగనాగాత్రములను
బరిమార్జనముఁ జేసి పరితాప మొనరించు
                        ఘనమానవిషము తత్క్షణమె దించె
నధికప్రకాశితాశాంతశశాంకరు
                        గ్నికరంబు విమలమానినికపోల
ములయందు వెసఁ బ్రతిఫలనంబు నొంది స
                        మంచితభంగి వ్యాపించె నపుడు

⁠


గీ.⁠

సితరుచిబ్రహూర్మిభుజసమాశ్లిష్టభూరి
వేలయైనను గదలి క్షోభింపఁజేసె
ననఁగ మన్మథగతపారయదుగణమును
క్షోభ మొందించె నను టెంతచోద్య మహహ!

⁠ 218


వ.⁠

అంత మదనుం డేకాకి యగుటంజేసి యసామర్థ్యంబున గృహాంత
రంబులయందు సుప్తుండై యుండి గవాక్షవివరప్రవిష్టంబులగుటం
జేసి స్ఫటికదండసంకాశంబులైన చంద్రకిరణంబు లవలంబించి
లేచి చంద్రోదయంబుకంటె మున్ను గాఢసంతమసంబుచేత
నలక్షితబాణలక్ష్యుండై యుండి శీతకరుం డుదితుండై దిశలు

⁠