Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

స్మరలీలోత్సుక యైన యొక్కసతి చంచత్ప్రీతితో నాత్మమం
దిరమం దుండి గవాక్షమధ్యగతదృష్టిన్ వేగ నస్తాద్రిభా
స్వరమధ్యం బిఁక హస్తమాత్ర మవకాశం బున్నదంచున్ దదం
తరమానంబు గణింపుచుండెఁ దపనాప్తప్రాప్తిఁ గాంక్షింపుచున్.

187


చ.

పరిణితి నొందినందున విభాపరిహీనప్రకాశయుక్తమై
స్ఫురితవిపాండురాభ్రశిరమున్ వహియించి యనుష్ణగాత్రమై
మఱియు ననాతపం బగుట మందదివాకరబింబనేత్ర మై
యరుదుగ నత్తఱిన్ శిథిలమై కననయ్యె దినంబు చూడఁగన్.

188


చ.

ఉరునవకుంకుమారుణపయోధరయై స్వకరావసక్తభా
స్వరరుచిరాంబరాఢ్యయయి బంధురరాగసమేతయైన య
వ్వరుణదిశాంబుజాక్షిమణిపై నతిసక్తిని బొంది భానుఁడున్
గర మనురక్తుఁడయ్యె నధికద్యుతి నెల్ల నడంచి ప్రీతితోన్.

189


చ.

అలరు దినాంతశీతలతరానిలలోలితనూత్నవల్లికాం
గుళి యగుటన్ నివాసమునకున్ వెస నంగుళిసంజ్ఞచేఁ దగం
బిలుచుచునున్నదానిక్రియఁ బెంపగు శాఖికిఁ బక్షిసంఘముల్
మరలఁగ నుత్తరం బిడిన మాడ్కిఁ జెలంగెఁ దదారవంబులన్.

190


గీ.

అరయ సంధ్యాసమీపమం దబ్జసఖుని
గరము లప్పుడె శైలశృంగంబుఁ జేరె;
సజ్జనులు నాశకాల మాసన్న మైన
నున్నతస్థానమున నుండు టుచితమె గద?

191


గీ.

జగతి దైవంబు ప్రతికూల మగుచు నుండ
సాధనము లెన్ని యుండిన సఫల మగునె?
కరసహస్రమున్నఁ బతనకాలమందు
నూఁత గొన నాఁగెనే హేళి కొక్కటైన?

192


క.

అతులజపాసుమగుచ్ఛ
ద్యుతి యగు రవి యస్తమాన మొందుచునుండన్
దతదిగ్వలయము కురువిం
దతతిగతనుమధ్యమైన నలువున నొప్పెన్.

193


గీ.

తప్తకనకాభమగు రవితనువు సలిల
మందు నర్ధనిమగ్నమై యలరె నప్పు