Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లచేత గుణవదాశ్రయాపేక్షచేత నంతట నుపాశ్రితంబులైన చం
దంబునం బ్రకాశించె; మఱియు సరసిజలంబులు వధూజనశ్రవణ
పతితంబులైన నీలోత్పలంబులు తమయందుఁ బొడమినవైనను
నిజతరంగంబుచేఁ దటతలంబునకు నిష్కాసంబు గావించె, స్వసం
భవుండైనను గొంతకాలం బున్నతస్థానగతుండై యుండి పదంపడి
పతితుండైనవాఁడు నిర్లేపులకుఁ బరిత్యాజ్యుం డగు టది యుక్తంబే
కదా! మఱియుఁ దోయపూరంబుచే నంగనలధౌతలాక్షార
సంబైన దంతాధరంబు దంతక్షతులచేతఁ బ్రక్షాళితాంగరాగం
బైన శరీరంబు ప్రత్యగ్రనఖక్షతంబులచేత నలంకరింపఁబడియె;
నది యుచితంబు గాదె సజ్జను లగువారిని పదాశ్రితు లగువారలు
విభవాపాయకాలంబునందు శోభావైభవంబులచేతఁ బ్రకాశిం
పంజేయుదురుగదా! మఱియును.

175


ఉ.

క్షాళితపత్రపఙ్క్తి యగు కాంతలమోములఁ దోయపూరసం
చాలనలంబమానవిలసన్మృదుకేసరమిశ్రపింజరో
ద్వేలితమద్యభాగ లగు విశ్రుతమేచకహృద్యసుందరా
గ్రాలకమంజరుల్ సహృద లౌట రచించెను బత్రరేఖలన్.

176


సీ.

అంభోధిజలముచే యదువులయంగరా
                        గము వక్షములనుండి కడఁగఁబడియె
 ఘనకేశములయందుఁ గల్గు శేఖరములు
                        హరియింపఁ బడియె నేత్రాచలంబు
లందున్న మదరుచి హరియింపఁ బడదయ్యె
                        నది యుక్తమేకదా! యవని నాత్మ
వంతుల చతుర్భవప్రియం బన్యుల
                        చేత నలంఘ్యమై చెలఁగుఁగాదె?


గీ.

మఱియు నయ్యాదవుల మేనవఱలు నంగ
రాగము హరించె హృద్గతరాగ మందె
కదలకుండె; ధీరాంతరంగత్వ మొందు
నట్టివారికిఁ బరులచే హాని గలదె?

177


గీ.

చారుడిండీర మఱుతకు హారమయ్యెఁ
జారుపటమయ్యెఁ గటికట్లు శైవలంబు
చెక్కులకుఁ బత్రరచనయై చెలఁగె; నదియె
జలము లిట్లు కాంతలకుఁ భూషణము లొసఁగె.

178