పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

ప్రథమాశ్వాసము


భూర్భువస్స్వర్లోకములు మహర్లోకంబు
             జనలోక మెక్కి విశ్రాంతి మెఱయ
నఖిలదిక్కులు ముంచి బ్రహ్మాండగోళ
మప్పళింపుచు.....సప్తార్ణములు
నిండికొనియుండఁగా రిత్తనింగితోడఁ
గొంతకాలంబు శూన్యమై గొడ్డుపోయె.

51


వ.

అప్పుడు బ్రహ్మ నారాయణుండై శివయోగముద్రాముద్రితలోచనుం డగుచు సముద్రంబు నడుమం బవ్వళించిన.

52


క.

జనలోక మెక్కి సిద్ధులు
వినుతించిరి జలధిస(లిలవీచీరింఖ-
ద్ఘన)జాతయోగనిద్రా-
వినిమీలితదీర్ఘనయను విషధరశయనున్.

53


గీ.

దేవతలు సంస్తుతించంగఁ దెల్లవాఱెఁ
గల్పసంహారకాలంబు కాళరాత్రి
యంత మేల్కని కూర్చుండె నాదిపురుషుఁ
డాదిమబ్రహ్మ జగము సేయంగఁ దలఁచి.

54


గీ.

అభినవోన్మేషజిహ్మ మైనట్టి దృష్టి
దిశలు వీక్షించెఁ ద్రిభువనాధీశ్వరుండు
చింతనొందె లోకంబు సృజించు వెఱవు
హృదయమున........................

55