పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివరాత్రిమాహాత్మ్యము

16


నూఱువేల్గ్రంథములలోన నుతి వహించి
శ్రీమహాస్కాందసంహిత శివునిఁ జెప్పు.

47


వ.

అందు శివరాత్రిమాహాత్మ్యంబు చెప్పంబడి యుండు; నమ్మహావ్రతం బెట్టి దెవ్వ రాచరించి రే ఫలంబు నొసంగు మాకుం బరిపాటి తేటపడ వివరింపుమనిన నక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె.

48


ఉ.

తాపససార్వభౌములు సదాశివరాత్రిమహావ్రతంబు దో
షాపహృతిక్షమంబు వినుఁ డాదరణంబున నేను సద్గురు
శ్రీపదపద్మముల్ దలఁచి చెప్పెద శంకరసంహితాకథా
దీపితభవ్యమార్గమున దేటపడన్ మొదలింటినుండియున్.

49


గీ.

ప్రళయకాలంబు తుదఁ గాళరాత్రి చనిన
నపరమగు సర్గమునకు బీజాంకురంబు
శీతమును నుష్ణమును గాక చిలుపచిలుప
గంధవాహంబు వీచె నిర్గంధమగుచు.

50


సీ.

మూలముట్టుగను నున్మూలనంబును బొంది
             మహిధరంబులు రూపుమాలి యుండఁ
ద్రిభువనంబులుఁ జలత్తృణరాశియునుఁ బోలె
             సప్తార్చిచేత భస్మంబు గాఁగఁ
బుష్కలావర్తకాంభోధరంబులు వృష్టి
             విశ్వప్రపంచంబు వెల్లిగొనఁగ