పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

ప్రథమాశ్వాసము


నుత్తరోత్తర సత్కృత్య మొప్పు నీకుఁ
గాలనిర్ణయకలన నీ కరతలంబు
పూర్వమున మేము సేసిన పుణ్యమెల్ల
ఫలితముగ నేఁగుదెంచితి[1]ప్రార్థనంబు.

35


వ.

వేదంబులు నాలు గంగంబు లాఱు మీమాంసాన్యాయ విస్తరపురాణ ధర్మశాస్త్రంబు లాయుర్వేద ధనుర్వేదంబు లర్థశాస్త్రంబు లను నష్టాదశవిద్యానిధానంబులకు నాదికర్త సదాశివుం డా శూలపాణి యమ్మహాస్థానంబులు బ్రహ్మ కుపదేశించె.అనంతరంబ శంకరాజ్ఞాప్రచోదితుండై కృష్ణద్వైపాయనాభిధానంబున ననాదినిధనుండు పుండరీకాక్షుండును, నరణియందు వైశ్వానరుండునుం బోలె ద్వాపరాంతంబున సత్యవతియం దావిర్భవించె.వేదార్థోపబృంహణార్థంబు సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితంబు లను పంచలక్షణంబులం గలిగి బ్రాహ్మంబు వైష్ణవంబు శైవంబు భాగవతంబు భవిష్యంబు నారదీయంబు మార్కండేయం బాగ్నేయంబు పాద్మంబు బ్రహ్మకైవర్తంబు లైంగంబు వారాహంబు స్కాందంబు వామనంబు కౌర్మంబు మాత్స్యంబు గారుడంబు బ్రహ్మాండంబు నను మహాపురాణంబులు పదునెనిమిది గల్పించె నవియు.

46


గీ.

గ్రంథసంఖ్యఁ బురాణసంఘంబు గూడి
నాల్గు లక్షలౌ నీ పురాణములలోన

  1. తప్రార్థనంబ